సోమవారం 13 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 00:24:58

సేవలు భేష్‌.. బాధితులు సేఫ్‌

సేవలు భేష్‌..   బాధితులు సేఫ్‌

  • n ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యశాలలు
  • n వ్యాధి బాధితులకు అండగా ప్రభుత్వం 
  • n సర్కారు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యచికిత్సలు
  • n నిరంతరం సేవలందిస్తున్న  యంత్రాంగం
  • n ప్రభుత్వ వైద్యంతో  కోలుకున్న వ్యక్తుల్లో ఆనందం

రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సమర శంఖం పూరించింది.. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.. వైద్య బృందాలను అప్రమత్తం చేశారు.. వైరస్‌ బాధితులకు  మనోధైర్యం కల్పించేలా సిబ్బందికి సూచనలు చేశారు.. దీంతో జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రితో పాటు జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్యసేవలందించారు.. మూడు పూటలా పోషకాహారం.. 24 గంటలూ అందుబాటులో ఉండే సిబ్బంది.. వెరసి బాధితులు క్షేమంగా వైరస్‌ బారినుంచి కోలుకుంటున్నారు. ఆరోగ్యవంతులుగా ఇళ్లకు  చేరుతున్నారు.. మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్న       ప్రతిపక్షాలకు ప్రాణాంతక వ్యాధి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడిన తామే సాక్ష్యం అంటూ సమాధానం చెబుతున్నారు. 

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రధానంగా ప్రజారోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నది. ఇటీవల కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టింది. వ్యాధి బాధితులకు తక్షణమే సరైన వైద్యా న్ని అందించడంతోపాటు వారికి అండగా ఉంటూ భరోసానిస్తున్నది. జిల్లాలో తొలి కేసు నమోదైన నాటి నుంచి బాధితులకు అండగా ఉంటూ మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఖమ్మం ప్రధానాసుపత్రిలో వైద్య సిబ్బం ది 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పాజిటివ్‌ లక్షణాలున్న వ్యాధిగ్రస్తులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

జిల్లాలోని రఘునాథపాలెం మండలం శారద కళాశాలలో, ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలోని వైటీసీ కేంద్రంలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో వైద్య సిబ్బంది ఉండి నిరంతరం అనుమానితులను, కాంటాక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని వసతులూ కల్పిస్తున్నది. దీంతో ఈ కేంద్రాల్లో సేవలు పొందిన వారు కూడా ఆరోగ్యవంతులుగా ఇళ్లకు తిరిగి వెళ్లారు.     

సగానికి పైగా డిశ్చార్జులు..

ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో 40 యాక్టివ్‌ కేసులుండగా అందులో 27 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకున్నా రు. కరోనా వైరస్‌ నుంచి బయటపడి ప్రభుత్వ వైద్యంతో కోలుకొని ఇళ్లకు వెళ్లిన వారు సగానికిపైగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్ర భుత్వ వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును 120 పడకలతో ఏర్పాటు చేసింది. శారద కాలేజీ లో 500 పడకలతో, మద్దులపల్లి వైటీసీలో 100 పడకలతో ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలున్నా యి. అనుమానితులకు, పాజిటివ్‌ వ్యక్తుల కాం టాక్టులకు ఈ కేంద్రాల్లో వైద్యం అందిస్తున్నారు. వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. అయితే ప్రభుత్వ వైద్యశాలల్లో రోగు లు, అనుమానితులు, కాంటాక్టులు మెరుగైన వైద్య సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్తుంటే విపక్ష నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను చూసి ప్రజలు, కోలుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరోగ్యంతో వెళ్లినవారు ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానాలని చెబుతున్నారు. 

సంపూర్ణ ఆరోగ్యవంతులై ఇళ్లకు చేరారు

కరోనా వ్యాధి సోకకుం డా ఉండేందుకు ప్రభు త్వం సూచించిన మా ర్గాలను పాటిస్తూ ప్రజ లు అప్రమత్తంగా ఉం డాలి. భౌతికదూరం పాటించాలి. ముఖానికి మాస్కును విధిగా ధరించాలి. ఇప్పటి వరకు జిల్లాలో 40 యాక్టివ్‌ కేసులున్నాయి. 27 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులై ఇళ్లకు చేరారు. ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో ఓపీ విభాగంలో 3117 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాం. 66 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 27మంది ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్‌ అయ్యారు. 

- డాక్టర్‌ బి.మాలతి, డీఎంహెచ్‌వో


ఓపీ రోగులకూ అవగాహన కల్పిస్తున్నాం..

ఐసోలేషన్‌ వార్డులో బాదితులకు నిరంతరం సేవలందిస్తున్నాం. వా రి ఆరోగ్యాలను కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాం. రోజుకు 25 నుంచి 50 మంది బాదితులు ఇన్‌పేషెంట్‌ గా ఉంటున్నారు. ఇప్ప టి వరకు సుమారు 3117 మందికి ఓపీ సేవలు అందించాం. కరోనా పట్ల వారికి అవగహన కల్పించాం. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో 30 మంది ఉన్నారు. అందులో 9 పాజిటివ్‌ వ్యక్తులు, 21 మంది అనుమానితులు ఉన్నారు.     \

- డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ 

నిరంతరం శ్రమిస్తున్నాం..

కరోనా బాధితులకు వై ద్య సేవలందించడంలో నిరంతరం శ్రమిస్తు న్నాం. వారికి వైద్య సేవలందిస్తూనే వారి ప్రైమరీ కాంటాక్టులను కూడా గుర్తిస్తున్నాం. అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇటీవల కాలంలో కేసులు పెరుగుతున్నప్పటికీ అందకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాలి. ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే కేసులు తగ్గుతాయి.

- డాక్టర్‌ బొలికొండ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో

రోగులకు ధైర్యం చెబుతున్నాం..

కరోనా పాజిటివ్‌ అనగానే రోగుల్లో చాలామంది భయపడుతున్నారు. వారందరికీ ధైర్యం చెబుతున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారిలో చైతన్యాన్ని నింపుతున్నాం. మెరుగైన వైద్యసేవలందించి ప్రతి ఒక్కరినీ సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసి ఇళ్లకు పంపుతున్నాం. తొలి రోజుల్లో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్దగా లేదు. కానీ ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. 

-డాక్టర్‌ వరికూటి సుబ్బారావు, జిల్లా క్షయ నివారణాధికారి


logo