సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 30, 2020 , 04:53:14

‘వేదిక’కు వితరణ..

‘వేదిక’కు వితరణ..

  • గిఫ్ట్‌డీడ్‌ దస్తావేజు అందజేసిన ‘నల్లమల’..

ఖమ్మం వ్యవసాయం, జూన్‌ 29 : సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు సొంత భూమిని గిఫ్టు డీడ్‌లో భాగంగా రైతు వేదిక కోసం వితరణ చేశారు. కొద్ది రోజుల క్రితమే బోనకల్‌ మండలం పరిధిలోని రాయన్నపేటలో 2,400 గజాల స్థలాన్ని వితరణ చేశారు. ఇందుకు సంబంధించి గిఫ్ట్‌ డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసిన దస్తావేజులను సోమవారం జేడీఏ ఝాన్సీలక్ష్మీకుమారికి అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయనిర్మల, మధిర ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


logo