సోమవారం 13 జూలై 2020
Khammam - Jun 30, 2020 , 04:49:17

డీసీఎంఎస్‌కు పూర్వ వైభవం

డీసీఎంఎస్‌కు  పూర్వ వైభవం

  • వచ్చే ఏడాదిలో సొసైటీ  ఆధ్వర్యంలో 100  కొనుగోలు కేంద్రాలు
  • ఈ-రేడియేషన్‌ ప్లాంట్‌  అధ్యయనానికి సబ్‌కమిటీ
  •  పాలకవర్గ సమావేశంలో  చైర్మన్‌ రాయల

ఖమ్మం వ్యవసాయం, జూన్‌ 29 : జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)కి పూర్వ వైభవం తీసుకవచ్చే విధంగా పాలకవర్గం ప్రత్యేక కృషి చేస్తుందని చైర్మన్‌ రాయల శేషగిరిరావు తెలిపారు. సోమవారం డీసీఎంఎస్‌ పాలకవర్గం సమావేశం నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథిగృహంలో రాయల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం తరువాత డీసీఎంఎస్‌ ద్వారా చేపట్టిన వరి, మక్క క్రయవిక్రయాలు, వచ్చిన ఆదాయ,వ్యయాలపై సమీక్ష చేశారు. డీసీఎంఎస్‌ ద్వారా చేపట్టబోయే పలు కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం చైర్మన్‌ను పాలకవర్గ సభ్యులు శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా రాయల మాట్లాడుతూ సొసైటీ ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామన్నారు. గతంలో ఈ-రేడియేషన్‌ ప్లాంట్‌ కోసం వెచ్చించిన నిధులు, కొనుగోలు చేసిన సామగ్రిపై పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసేందుకు వైస్‌చైర్మన్‌ అధ్యక్షతన సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో ఉన్న డీసీఎంఎస్‌ స్థలంలో రూ. కోటి వ్యయంతో నూతనంగా సైంటిఫిక్‌ గోడౌ న్‌ నిర్మాణం చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోడౌన్లను పరిశీలించి పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకురావాలని సూత్ర ప్రాయంగా పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు నాగుబండి శ్రీనివాసరావు, జక్కుల లక్ష్మయ్య, కోటేశ్వరరావు, రాజు, వెంకటేశ్వర్లు, ఎస్సయ్యతో పాటు డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo