శుక్రవారం 03 జూలై 2020
Khammam - Jun 29, 2020 , 02:54:29

ఖమ్మంలో ఒకటి, భద్రాద్రిలో ఐదు

ఖమ్మంలో ఒకటి, భద్రాద్రిలో ఐదు

ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు 

మయూరిసెంటర్‌/ కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఖమ్మంలో ఒకటి కాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు ఉన్నాయి. ఖమ్మంలోని నిజాంపేటకు చెందిన 46 ఏళ్ల మహిళ ఛాతీనొప్పి, ఆయాసంతో బాధపడుతూ మూడు రోజుల క్రితం వరంగల్‌ చెస్ట్‌ హాస్పిటల్‌కు వెళ్లింది. కరోనా లక్షణాలు కన్పించడంతో అక్కడి వైద్యాధికారులు ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెకు వరంగల్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో కలిపి ఐదు కరోనా పాజిటవ్‌ కేసులు నమోదైనట్లు ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


logo