శనివారం 04 జూలై 2020
Khammam - Jun 29, 2020 , 02:52:53

నగరంలో భారీ వర్షం

నగరంలో భారీ వర్షం

ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే నగరంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు మెరుపులతో రాత్రి 7 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. నగరంలోని ప్రధాన రహదారులతోపాటు శివారు కాలనీలు జలమయమయ్యాయి. 15 రోజుల నుంచి జిల్లాలో వానకాలం సాగు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదివారం కురిసిన వర్షంతో మొలకలకు ప్రాణం పోసినట్లయింది.                 -ఖమ్మం వ్యవసాయం


logo