బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 28, 2020 , 01:49:53

అక్షరంపై మాజీ ప్రధాని పీవీకి అమితమైన ప్రేమ

అక్షరంపై మాజీ ప్రధాని  పీవీకి అమితమైన ప్రేమ

  • ఖమ్మం జిల్లాలో కళాశాలల ఏర్పాటుకు చొరవ
  •  అపర చాణక్యుడితో జిల్లాకు అనుబంధం
  • పలువురితో సన్నిహిత  సంబంధాలు
  • ఆయన జ్ఞాపకాలను  పంచుకున్న అప్పటి నాయకులు 

అపర చాణక్యుడు.. బహు భాషా కోవిదుడు.. రాజకీయ ధురంధరుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. ఆయన్ను తలచుకోవడమంటే చరిత్రను తిరిగి   గుర్తుకు చేసుకున్నట్లే.. అభివృద్ధి పునాదులను తడిమి చూడటమే.. దేశ చరిత్రలో ఆయన పాలన  ఓ సువర్ణ అధ్యాయం..! ఆర్థికంగా కుంగి పోయి ఉన్న దేశానికి సరళీకృత సంస్కరణలతో కొత్త ఊపిరి పోశారు.. విద్యాలయాలకు ప్రాణం పోశారు.. అలాంటి మేరు నగధీరునికి ఖమ్మం జిల్లాతో విడదీయ లేని  అనుబంధం ఉంది.. ఆయన ఇద్దరు కుమార్తెలను ఈ  జిల్లా వాసులకే ఇచ్చి వివాహం చేశారు.. ఎన్నో విద్యాలయాల ఏర్పాటుకు తన చేయూతనందించారు.. అంతేగాక ఆయన్ను రాజకీయ       గురువుగా భావించే వారు ఎందరో ఉన్నారు.. పీవీ            శత జయంత్యుత్సవాల సందర్భంగా ‘నమస్తే’    ప్రత్యేక కథనం.                      -ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ

పీవీ సేవలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఆయనతో గడిపి న, ఆయన వెన్నంటి నడిచిన, ఆయనతో కలిసి వెసిన అడుగులు గుర్తుకువస్తున్నాయి. అనారో గ్యం కారణంగా కొద్దికొద్దిగా మర్చిపోయినప్పటికీ శక్తిని కూడా గట్టుకుని మీరు వచ్చిన ఉద్దేశాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. 1952లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నతనం నుంచి రాజకీయాలలో చురుగ్గా ఉన్నందున హైదరాబాద్‌ వెళ్లాక నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా ఎదిగా. అప్పుడు ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఉన్నారు. 1955లో అనుకుంటా.. పీవీ నర్సింహారావును తొలిసారి వరంగల్‌లో కలిశాను. హన్మకొండలోని కాశయ్యతోటలోనే అనుకుంటా.. అక్కడ విద్యార్థులతో జరిగిన సభకు అతిథిగా పీవీ హాజరయ్యారు. ఆయన ఉపన్యాసం విన్నాక విద్యార్థులందరం ఆయనతో కరచాలనం చేసేందుకు పరుగులు పెట్టాం. పీవీ అని అప్పటి వరకు వినడమే తప్ప స్వయంగా ఆయన మాటలు వినలేదు. వరంగల్‌ సభనుంచి ప్రారంభమైన నా పరిచయం చివరి అంకం వరకు కొనసాగింది. ఆ సభలో హైదరాబాద్‌ నుంచి నేనే హాజరైనప్పటికీ ఖమ్మం (ఖమ్మం జిల్లా అప్పటికి ఏర్పడలేదు) వాసిగానే నన్ను అప్పటి నాయకులు పీవీకి పరిచయం చేశారు. నా చురుకుదనం, నా స్పీడ్‌ను చూసి పీవీ నాతో ఆరోజు దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు. అప్పటికే కమ్యూనిస్టులపై నిషేధం కొనసాగుతున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మంలోని అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం బలంగానే ఉంది.  

విలువల పునాదిగానే రాజకీయాలు..

ఎంత విచిత్రం అనిపిస్తుందంటే ఇప్పటి రాజకీయాలు రూపాయి పునాదిలో ఉంటే అప్పటి రాజకీయాలు విలువలే పునాదిగా ఉండేది. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు (కాంగ్రెస్‌) ఉంటే ఆయన అన్న బూర్గుల వెంకటేశ్వరరావు కుమారుడు బూర్గుల నర్సింహారావు సీసీఐ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్‌ఎఫ్‌కు హైదరాబాద్‌ రాష్ర్టానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉండేవాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఏనాడు అతనిపై ద్వేషం పెంచుకోలేదు. అప్పటి రాజకీయాలు అంత గొప్పగా ఉండేవి. అయన ఇటీవలనే కాలేజీ ప్రిన్సిపల్‌గా రిటైరయ్యారు. 

విద్యాభివృద్ధికి పునాది..

గిరిజనులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా ఆనాడు విద్యాపరంగా వెనుకబడి ఉండేది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శివారు ప్రాంతంగా ఖమ్మంను పరిగణించేవారు. ఖమ్మం జిల్లాలోని మధిర, కొత్తగూడెం, ఖమ్మం, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉండేవి. ఉన్నత విద్యనభ్యసించాలంటే హైదరాబాద్‌ వంటి నగరానికి వెళ్లాల్సి వచ్చేది. ఆనాడు విద్యా, సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భంగా పీవీ నర్సింహారావు ఖమ్మం ప్రాంతంలో విద్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మధిర శాసనసభ్యుడిగా పనిచేసిన బొమ్మకంటి సత్యనారాయణరావు ఖమ్మం జిల్లాలో విద్యా వెనుకబాటు గురించి అనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు దృష్టికి పీపీ నరసింహారావు ద్వారా తీసుకెళ్లారు. బూర్గులకు అనుంగ శిష్యునిగా ఉన్న పీవీ నరసింహారావు బొమ్మకంటి సత్యనారాయణరావుకు జిల్లాలో విద్యావ్యాప్తి పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి ఖమ్మం జిల్లాలో పాఠశాలల అనుమతితోపాటు ఉన్నత విద్యాభ్యాసం కోసం చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఆనాడు పాఠశాల విద్య అందని దాక్షాగా ఉండేది.     

పది, పదిహేను గ్రామాలకు కలిపి ఓ ప్రాథమిక పాఠశాల ఉండేంది. ప్రజల కుటుంబ, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో చదువుకోవాలనే ఆకాంక్ష నెరవేరేదికాదు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఓ డిగ్రీ కళాశాల నెలకొల్పాలనే తలంపును ఆనా టి ముఖ్యమంత్రి బూర్గుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కృషిలో భాగంగానే ఖమ్మంలో ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగింది. అలాగే పీవీ నర్సింహారావు కేంద్ర మానవవనరుల శాఖామంత్రిగా ఉన్నప్పుడు పాలేరులో నవోదయ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుకు పాటుబడ్డారు. దీంతో జిల్లాలోని పలువురికి ఆ పాఠశాలలో చదువుకునే అవకాశం లభించింది. అలాగే కొత్తగూడెం ప్రాంతంలో మరో గిరిజన రెసిడెన్షియల్‌పాఠశాలను నెలకొల్పి ఏజెన్సీ ప్రాంత విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. 

ఖమ్మం జిల్లా ఏర్పాటులో     బొమ్మకంటిదే కీలకపాత్ర..

1953లో వరంగల్‌ జిల్లా నుంచి ప్రత్యేక ఖమ్మం జిల్లా ఏర్పడటంతో ముఖ్యపాత్ర పోషించారు మధిరకు చెందిన అప్పటి నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ. ఆయనకు కూడా పీవీతో అనుబంధం ఉండేది. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధంతోనే ఖమ్మం జిల్లా ఏర్పాటైంది. కీలక విషయాలను, నిర్ణయాలను చేసేటప్పుడు పీవీ నర్సింహారావును సంప్రదించేవాళ్లమని ఇప్పటికీ నాటి   నేతలు చెప్తుంటారు. 

ఖమ్మంలో 25 రోజులు..

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో పీవీ నర్సింహారావు ఖమ్మంలో 25 రోజులు గడిపారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లక్ష్మీకాంతమ్మ పోటీ చేశారు. ఆ ఎన్నికలకు పీవీ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించారు. ఖమ్మం గెస్ట్‌హౌజ్‌లో ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించేవారు. ఆ ఎన్నికల్లో నేను, సామినేని ఉపేంద్రయ్య కాంగ్రెస్‌ నుంచి వేరుపడి ఉన్నాం. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో లక్ష్మీకాంతమ్మ 16,400 ఓట్లతో గెలుపొందారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌, డిగ్రీ, పీజీ కళాశాల ఏర్పాటుకు బొమ్మకంటి సత్యనారాయదే కీలకపాత్ర. అప్పట్లో వరంగల్‌ జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక్క హైస్కూల్‌ మాత్రమే ఉండేవి. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు. పది గ్రామాలకు కలిపి ఒక ప్రైమరీ పాఠశాల ఉండేది. ఐదు తాలుకాల్లో కూడా ఒక్క కాలేజీ లేదు. ఇదే విషయాన్ని బొమ్మకంటి సత్యం ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావుకు చెప్పారు. కాంపోనెంట్‌ గ్రాంట్‌ కింద ఒక లక్ష రూపాయలు చెల్లించమని పీవీ చెప్పాడు.

అప్పట్లో లక్ష అంటే ఇప్పుడు కోటి రూపాయలతో సమానం. ఎవరి దగ్గర అంత డబ్బు లేదు. అయినా కాలేజీ రప్పించుకోవాలి. ఈవిషయంపై పీవీ పదేపదే గుర్తు చేసేవాడు. అప్పటి భూస్వామి అయిన గెంటాల సత్యనారాయణ దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆయనకు వందలాది ఎకరాల భూమి ఉండేది. బొమ్మకంటి చెప్పడంతోనే గెంటాల సరేనని రూ.లక్ష చెల్లించాడు. ఆయన భూస్వామితో పాటు ఇనుపరాయి వ్యాపారం చేసేవాడు. బొమ్మకంటికి దగ్గర బంధువు కూడా రూ.లక్ష చెల్లించిన వెంటనే పీవీ నర్సింహారావు 1954లో కాలేజీని మంజూరు చేయించారు.

ఖమ్మం జిల్లాతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఆయనకు బంధువులు ఉన్నారు. ఆయన చిన్న కుమార్తెను కొత్తగూడెంలోని రేగళ్ల గ్రామానికి చెందిన ఓ ప్రముఖునికి ఇచ్చారు. కల్లూరు మండలానికి చెందిన ఐపీఎస్‌ అధికారి నందన్‌కు మరో కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఖమ్మం జిల్లాతో ఆయనకు బంధుత్వంతోపాటు పలువురు అభిమానులు, అనుచరులు ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తరపున సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి నేను పోటీలో ఉన్నా. భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి రజబ్‌అలీ పోటీ చేస్తున్నాడు. నా గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభను ఏర్పాటుచేశాం. ఆసభకు అప్పుడు ప్రధానిమంత్రిగానే ఉన్న పీవీ నర్సింహారావు హాజరయ్యారు. ఆసభ, అక్కడ పీవీ మాట్లాడిన తీరు నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చి నా గురించి సభలో మాట్లాడటంతో పాటు ప్రత్యర్థి రజబ్‌అలీ గురించి కూడా సభలో చెప్పడం పీవీ ఔనత్యానికి నిదర్శనం. ఆయన సంస్కా రం అలాంటిది. ఆవేదికపై నుంచే ప్రతిపక్ష నాయకుడు గురించి ప్రస్తుతించడమంటే ఆయన ఆదర్శం ఎంత గొప్పదో తెలుస్తుంది. logo