మంగళవారం 07 జూలై 2020
Khammam - Jun 27, 2020 , 02:08:07

విస్తరిస్తున్న కొవిడ్‌ మహమ్మారి..

విస్తరిస్తున్న కొవిడ్‌ మహమ్మారి..

  • ఉమ్మడి జిల్లాలో 65కు చేరిన కేసులు
  • తాజాగా ఖమ్మంలో మూడు.. భద్రాద్రిలో రెండు పాజిటివ్‌..
  • కంటైన్మెంట్‌ జోన్లలో పారిశుధ్య పనులు చేపడుతున్న అధికారులు

మయూరిసెంటర్‌: ఖమ్మం నగరంలో శుక్రవారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఈ మూడింటితో కలిపి ఇప్పటివరకు కేసుల సంఖ్య 55కు చేరింది. వీరిలో ముగ్గురు మృతిచెందారు. 25 మంది  కోలుకుని ఇండ్లకు వెళ్లారు. ఇంకా 27 యాక్టివ్‌ కేసులున్నాయి.

సారధీనగర్‌లో మహిళకు...

ఖమ్మం సారధీనగర్‌కు చెందిన మహిళ (26) పది రోజుల క్రితం ఏపీలోని విజయవాడకు వెళ్లి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరం ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు వెళ్లింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో టెస్ట్‌ చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆమె ఈ నెల 22న జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శాంపిల్స్‌ ఇచ్చింది.

రోటరీనగర్‌లో మానసిక రోగికి...

ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి(32) హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ వైద్యశాలలో వారం క్రితం చేరాడు. అతడిలో కరోనా లక్షణాలు కన్పించడంతో అక్కడే ఓ వైద్యశాలలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లో కొవిడ్‌ టెస్ట్‌ చేశారు.

ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో వృద్ధుడికి...

ఖమ్మం ఎన్‌ఎస్‌టీ రోడ్‌ ప్రాంతానికి చెందిన వృద్ధుడి(69)లో కరోనా లక్షణాలు కనబడడంతో ఈ నెల 24న వైద్యులు శాంపిల్స్‌ సేకరించి వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలకు పంపారు. శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఈ ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో ఇటీవల పాజిటివ్‌గా వచ్చిన రైల్వే ఉద్యోగికి ఈ వృద్ధుడు పా జిటివ్‌ కాంటాక్ట్‌గా వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపా యి.

ఈ వృద్ధుడు, సారధీనగర్‌కు చెందిన మహిళ జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వ చ్చిన వ్యక్తుల ద్వారానే జిల్లాలో కరోనా వ్యాపించింది. నగరంలోని ఖిల్లాలో ఒకే కటుంబానికి చెం దిన ఐదుగురు, నేలకొండపల్లి మండలం లో ఒకే కుటుంబం ద్వారా పదిమందికి, నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో విజయవాడకు చెందిన రై ల్వే ఉ ద్యోగి ద్వారా పదిమందికి కరోనా వైరస్‌ సో కింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాల్సిన అవసరాన్ని ఈ కేసులు గుర్తుచేస్తున్నాయి.

భద్రాద్రి జిల్లాలో పది కేసులు

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు ఎనిమిది,  శుక్రవారం నాడు పాల్వంచ, గౌతంపూర్‌ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైందని పేర్కొ న్నారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ను పటిష్టంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉం డాలని కోరారు.

ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ ఇతర దేశాలు, రాష్ర్టాలు, జిల్లాల నుంచి వ చ్చిన వారి ద్వారా వ్యాపింనవేనని తెలిపారు. కా బట్టి ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చిన వా రితో చాలా జాగ్రత్తగా ఉండాలని, చిన్న పొరపాటుతో పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని కోరారు. కరోనా లక్షణాలున్న వారు వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. జ్వరం, జ లుబు, తుమ్ములు, శ్వాసకోశ సమస్యలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిన వారి వివరాలను వైద్యాధికారులు సేకరించాలని, వీటికి మందులు ఇవ్వొద్దని మెడికల్‌ షాపుల యజమానులను ఆదేశించారు.


logo