సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 26, 2020 , 00:48:10

నేడు భద్రాద్రి ఏజెన్సీకి మంత్రి అజయ్‌

నేడు భద్రాద్రి ఏజెన్సీకి మంత్రి అజయ్‌

ఖమ్మం/ భద్రాచలం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం భద్రాచలం ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు మంత్రి ఖమ్మంలో బయలుదేరి 8:30 గంటలకు సారపాక చేరుకుంటారు. అక్కడ హరితహారంలో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటనున్నారు. అక్కడి నుంచి నేరుగా చర్ల, దుమ్ముగూడెం మండలాల వెళ్లి రైతు వేదిక భవనాలు, రహదారులకు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, వంతెనలు, పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌ భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్ంన  3 గంటలకు జులూరుపాడు మండలం పడమటి నర్సాపురం చేరుకొని హరితహారంలో పాల్గొంటారు.  3:15కు పాపకొల్లులో 11 కేవీ సబ్‌ స్టేషన్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు.  కాగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం భద్రాచలం చేరుకొని మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.


logo