ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 26, 2020 , 00:46:59

అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

లక్ష్మీదేవిపల్లి/ చుంచుపల్లి/ సుజాతనగర్‌: టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావుపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై టీఆర్‌ఎస్‌ లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌ మండల నాయకులు తమ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాఘవను కించపరిచే విధంగా సయ్యద్‌ యాకూబ్‌ ఆలీ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని ఆరోపించారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వ్యక్తిపై చీటింగ్‌ కేసు 

ఖమ్మం సిటీ: నగరంలోని ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పనిచేస్తున్న అకౌంటెంట్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హవేలీ డెవలపర్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో కొణిజర్ల మండలం భోజ్యాతండాకు చెందిన వడిత్యా బాబూరావు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన యజమాని సయ్యద్‌ సాధిక్‌అలీకి చెందిన చెక్కుల ద్వారా మొత్తం రూ.5.71 లక్షలను డ్రా చేశాడు. వాటి వివరాల గురించి ప్రశ్నించగా ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తానంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దీంతో విసుగు చెందిన హవేలీ డెవలపర్స్‌ మేనేజర్‌ సాదిక్‌ అలీ పోలీసులను ఆశ్రయించాడు. 


logo