గురువారం 02 జూలై 2020
Khammam - Jun 23, 2020 , 00:38:56

నడ్డి విరుస్తున్న పెట్రోల్‌ ధరలు

నడ్డి విరుస్తున్న పెట్రోల్‌ ధరలు

ఖమ్మం: కేంద్రం నిర్ణయం కారణంగా రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల      నడ్డి విరుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని 105 పెట్రోల్‌ బంకుల్లో ప్రతి రోజూ 73 లక్షల 85 వేల లీటర్ల పెట్రోలు, 2 కోట్ల 11 లక్షల 59 వేల లీటర్ల డీజిల్‌ వినియోగం జరుగుతున్నది. ఈ నెల 7 నుంచి సోమవారం వరకు ప్రతి రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ 17 రోజుల వ్యవధిలోనే లీటరు పెట్రోల్‌కు రూ.8.62, లీటర్‌ డీజిల్‌కు రూ.9.24 పెరిగాయి. ఈ విధంగా రోజుకు పెట్రోల్‌పై రూ.6.36 కోట్లు, డీజిల్‌పై రూ.19.55 కోట్లు మొత్తం కలుపుకొని రూ.25.91 కోట్ల వరకు అదనపు భారం వినియోగదారులపై పడుతున్నది. 

రోజు రోజుకూ పెరుగుదలే..

రెండు నెలల లాక్‌డౌన్‌ కాలంలో చమురు వినియోగం పూర్తిగా తగ్గింది. సడలింపులు రావడంతో ప్రజలు తమ పనుల్లో నిగ్నమవడంతో వినియోగం కూడా పెరుగుతున్నది. దీన్ని ఆదునుగా భావించిన కేంద్ర ప్రభుత్వం 17 రోజుల నుంచి ప్రతి రోజూ చమురు ధరలను పెంచుతూ వస్తున్నది. వాణిజ్య కార్యకలాపాలతోపాటు వ్యవసాయ పనులు కూడా ఒక్కసారిగా ఊపందుకోవడంతో చమురు వినియోగం పెరిగింది. ఆయా వర్గాలపై అధిక భారం పడుతున్నది.

రైతులకు తీరని దెబ్బ..

రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో ఆటో కార్మికులతోపాటు రైతులపైనా తీరని భారం పడుతున్నది. అరకొర కిరాయిలతో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగింది. అందుకు డీజిల్‌ అవసరం కావడంతో అధిక ధర అయి నా రైతులు తప్పక కొనుగోలు చేస్తున్నారు. logo