గురువారం 16 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:56:43

కొంప ముంచిన ‘జలదీక్ష

కొంప ముంచిన ‘జలదీక్ష

  •  వేళ కాంగ్రెస్‌ జన సమీకరణ నుంచి నేతల రాక
  •   నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌  జిల్లా ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: జలదీక్ష పేరుతో కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టుల బాట కార్యక్రమం.. ఇప్పుడు జిల్లా ప్రజలను భయాందోళనలోకి నెట్టివేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు ఆ పార్టీ అగ్ర నాయకుడు వి.హన్మంతరావు(వీహెచ్‌), ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులు హైదరాబాద్‌ నుంచి వచ్చారు. ప్రాజెక్టుల వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కరోనా తీవ్రంగా వ్యాపించిన  హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆ నాయకులను వెనక్కు వెళ్లిపోవాలని కోరారు. అయినప్పటికీ వారు వినలేదు. దీంతో వారినిముందుగా లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.  ఆ తరువాత ఆ నాయకులు భద్రాచలం వెళుతుండగా అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి విడిచిపెట్టారు.

వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌గా శనివారం నిర్ధారణ అయింది. దీంతో ఆ రోజున ఆయనను అరెస్ట్‌ చేసిన పోలీసులు, కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధుల్లో భయాందోళన నెలకొంది. వీహెచ్‌ సహా కాంగ్రెస్‌ నాయకులు ఎవరెవరిని కాంటాక్ట్‌ అయ్యారనే వివరాలను పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు.

కరోనా వేళ.. కాంగ్రెస్‌ జన సమీకరణ

కరోనా మహమ్మారి రాష్ట్ర రాజధానితో సహా జిల్లాలోకి విస్తరించి రోజు రోజుకూ అంతకంతకు పెరుగుతున్నది. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, ఒకేచోట గుమికాకుండా ఉండాలని ప్రభుత్వం పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మహమ్మారి ద్వారా వచ్చే మహా ప్రళయాన్ని ఆపడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నది. ఈ భయానక పరిస్థితిని యావత్‌ ప్రపంచం అనుభవిస్తున్నది. అయినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇవేవీ కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ఎందరు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా చెవికెక్కడం లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ నేతలు కుటిల రాజకీయం చేస్తూ జలదీక్షకు పూనుకున్నారు. కరోనా విస్తరణలో ‘మేము సైతం’ అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లా ప్రజాలను ‘కరోనా’ కోరల్లోకి నెట్టేశారు. 


logo