మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:53:08

వైరాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

వైరాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

  • ఎమ్మెల్యే రాములు నాయక్‌

వైరా : వైరాను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. ఆదివారం ఆయన జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 150 మంది నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మండల, పట్టణ అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, దార్న రాజశేఖర్‌, లయన్స్‌క్లబ్‌ పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కాపా మురళీకృష్ణ, మిషన్‌ భగీరథ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రవి, కౌన్సిలర్లు మరికంటి డేడికుమారి, గుగులోత్‌ లక్ష్మీబాయి, తడికమళ్ళ నాగేశ్వరరావు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, మాదినేని సునీత, నాయకులు మిట్టపల్లి నాగి, చల్లా సతీష్‌, నిప్పు, జవ్వాజి నాగరాజు, నంబూరి ఓంకార్‌ కార్తీక్‌, రాజేశ్‌, వీరబాబు  పాల్గొన్నారు. logo