గురువారం 02 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:49:34

మత్స్యసంపదకు కేరాఫ్‌ తెలంగాణ

మత్స్యసంపదకు కేరాఫ్‌ తెలంగాణ

  • ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

పినపాక : స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యసంపదకు తెలంగాణ కేరాఫ్‌గా మారిందని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండలంలోని టీకొత్తగూడెంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 90శాతం రాయితీపై మంజూరైన ఆరు పడవలను ఆయన మత్స్యకారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాబోవు రోజుల్లో చేపల ఎగుమతి రాష్ట్రంగా మారబోతుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఒక్కో పడవను రూ.65వేలకు కొనుగోలు చేసి 90శాతం రాయితీపై  రూ.6500కే అందజేస్తుందన్నారు. అనంతరం పడవలో గోదావరి నదిలో కొద్దిసేపు బోటింగ్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు కణితి చిన్నక్క, బాడిశ మహేశ్‌, మొగిలిపల్లి నర్సింహారావు, జిల్లామత్స్యశాఖ అధికారి కె వరదారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వీఎస్‌ఆర్‌ఎస్‌ వర్మ, ఆత్మకమిటీ చైర్మన్‌ పొనుగోటి భద్రయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దాట్ల వాసుబాబు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు కొండేరు రాము, పొనుగోటి కామేశ్వరరావు, బత్తుల వెంకటరెడ్డి, కటకం గణేష్‌, సోంపెల్లి తిరుపతి, పాడి దామోదర్‌రెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, బోడ ఈశ్వర్‌, సాయిని సమ్మయ్య పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాల మంజూరుకు కృషిచేస్తా..

టీకొత్తగూడెంలో గోదావరి నది వరద ఉధృతికి కోతకు గురై ఇండ్లు కూలిపోతున్న కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూ రు చేసేందుకు కృషిచేస్తానని రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం టీకొత్తగూడెం పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాలు ఇండ్ల స్థలాల కోసం వినతిపత్రం సమర్పించగా ఆయన స్పందించి మాట్లాడారు. వరద ఉధృతికి ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్హులకు ఇంటిస్థలాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని అన్నారు.  


logo