శుక్రవారం 03 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:46:59

ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం

  • జిల్లాలో పాక్షిక సూర్యగ్రహణం
  • ఉదయం 10:15 గంటల నుంచి కమ్ముకున్న మేఘాలు  
  • గ్రహణ కాలంలో ఆలయాల మూసివేత 

ఖమ్మం కల్చరల్‌: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆదివారం అమావాస్య గగనంలో సూర్య గ్రహణం కనువిందు చేసింది. వినువీధిలో సూర్యుడు, చంద్రుడు గమనాల విన్యాసం అబ్బురమైంది. ఖగోళంలో సూర్యచంద్రులు ఒక్కరుగా కలిసిపోయారు. చంద్రుడు అడ్డు రావడంతో వెలుగులు పంచే సూర్య భగవానుడు మూడు గంటలపాటు పాక్షికంగా వెనుకబడ్డాడు. వెరసి జిల్లాలో పాక్షిక సూర్య గ్రహణం అరుదైన అనుభూతిని ఇచ్చింది. జిల్లాలో  ఉదయం 10:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:44 వరకు మొత్తం 3 గంటల 34 నిమిషాల పాటు 51శాతం సూర్యుడు కనిపించకుండా పాక్షి క గ్రహణం ఏర్పడింది. జ్యేష్ట అమావాస్య మృగశిర 4, ఆరు ద్ర 1 పాదాల కలయికతో మిథునరాశిలో  సింహ, కన్య ల గ్నంలో  రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడింది. ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై రావడంతో సూర్యుడిని కప్పేసిన చంద్రుడి నీడ భూమిపై పడింది. ఆకాశంలో ఓ వైపు మేఘాలు అడ్డురావడం, అదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడడంతో ఆ సమయంలో వెలుతురు లేకుండా పోయింది. ఈ గ్రహణాన్ని ప్రజలు  నేరుగా చూడకుండా ఎక్స్‌రే ఫల్మ్‌లు, ఇతరత్రా రక్షిత అద్దాల ద్వా రా వీక్షించారు. కాగా గ్రహణ కాలంలో భూమిపై పడే అతినీలలోహిత కిరణాలు కొంత మేర కరోనా వైరస్‌ను నశింపజేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నా రు. కొన్ని చోట్ల ఈ గ్రహణం అంగుళ్యాకార దృ శ్యంగా కనిపించడంతో వీక్షకులకు నేత్రపర్వమైం ది. గ్రహణం కారణంగా జిల్లాలోని శైవ, వైష్ణ వ ఆలయాలన్నీ శనివారం రాత్రి నుంచే మూసి వేశారు. గ్రహణం విడుపు అనంతరం ఆదివారం సాయం త్రం  ఆలయాలను తెరిచి సంప్రోక్షణ చేశాక ఆరాధనలు నిర్వహించారు.


logo