శనివారం 11 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:44:38

జీవన యోగం

జీవన యోగం

  • యోగా సాధన చేసిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
  • ఆసనాలు వేసిన విద్యార్థులు,  యువతీ యువకులు
  • ఉమ్మడి జిల్లాలో సందడిగా యోగా దినోత్సవం 

ఖమ్మం కల్చరల్‌ : యోగా.. సంపూర్ణ ఆరోగ్యానికి ఓ అపూర్వ ప్రక్రియ. పలు రోగాలకు ఓ దివ్య ఔషధం. ఈ ప్రాణాయామం శరీరంలోని ఊపిరితిత్తులకు, మెదడుకు ఆక్సిజన్‌ అందించడంలో ఉత్ప్రేరకమవుతుంది. యోగా అభ్యాసాలు చేసే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ ప్రాణాయామం చేసే వారికి ఊపిరితిత్తులు వంద శాతం సక్రమంగా పనిచేస్తాయి. శ్వాస సంబంధ రోగాలు దరి చేరవు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనిషిని ఉల్లాసంగా ఉంచే ఓ మహత్తర ప్రక్రియే యోగా. దీని వల్ల ఆరోగ్యమే కాదు.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి వంటివి పెరుగుతాయి. ఆత్మ విశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉం టాయి. సమయస్ఫూర్తి, నైపుణ్యంపెరుగుతాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక అసనాలు, వ్యాయామాలు, యోగా ముద్రలు, ధ్యానం వం టి ప్రక్రియలతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక యోగామయమైంది. విద్యార్థులు, యువతీ యువకు లు యోగాసనాలు వేసి యోగా డేను జరుపుకొన్నారు.   

పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో.. 

యోగా రుషి రామ్‌దేవ్‌బాబా శిష్య బృందం, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు, పతంజలి యోగాసమితి ఆధ్వర్యం లో ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జిల్లా లో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. సమితి జిల్లా అధ్యక్షుడు ఉర్లుగొండ సురేశ్‌ ఆధ్వర్యంలో నగర సమీపంలోని బాలాజీ ఎస్టేట్స్‌లో యోగా సాధనాలు చేశారు. ఈ సందర్భంగా ఉర్లుగొండ సురేశ్‌ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు యోగాసాధనే శరణ్యమని అన్నారు. బాలా జీ ఎస్టేట్స్‌ అధినేత వత్సవాయి రవి, సమితి మహిళా అధ్యక్షురాలు ఆర్‌.మాధవీలత, తాజుద్దీన్‌, రవి, రోహిత, కల్యాణ్‌, సోమయ్య, నందకుమార్‌ పాల్గొన్నారు.  

శ్రీరామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో.. 

శ్రీరామచంద్ర మిషన్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో మిషన్‌ నిర్వాహకులు వీ.కిషన్‌రావు, రాధాకృష్ణ కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 


logo