ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 21, 2020 , 01:43:21

ఆయకట్టు రైతులకు సాగునీరు

ఆయకట్టు రైతులకు సాగునీరు

  • ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

వేంసూరు: చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఉపాధి పథకం ద్వారా ఎన్నెస్పీ, బేతుపల్లి కాల్వల్లో జరుగుతున్న పనులను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ఎమ్మెలే సండ్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన జిల్లాలోనే వ్యవసాయ రంగానికి ఉపాధిహామీ పనులను అనుసంధానం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా నీటి వనరులపై దృష్టిసారించామని తెలిపారు. ఎన్‌ఎస్‌పీ, బేతుపల్లి చెరువుల ద్వారా ఇతర చెరువులకు నీరు వెళ్లే కాల్వల్లో పేరుకపోయిన పూడికతీత, పిచ్చి చెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేయిస్తున్నామన్నారు. దీంతో అన్ని గ్రామాల్లో చివరి ఆయకట్టు రైతులకు సైతం సాగునీరు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ జిల్లా అధికారి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ శకుంతల, ఎంపీడీవో వీరేశం, ఏఓ రామ్మోహన్‌, పీఆర్‌ ఏఈ సాయికృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ జయలక్ష్మీ, ఆర్‌అండ్‌బీ ఏఈ ప్రకాశ్‌, డీటీ ఉపేందర్‌, ఆర్‌ఐ లక్ష్మణ్‌, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సుమలత, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ వెల్ది జగన్మోహన్‌రావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. logo