గురువారం 09 జూలై 2020
Khammam - Jun 20, 2020 , 01:55:22

సుడా చైర్మన్‌గా విజయ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

సుడా చైర్మన్‌గా విజయ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

n విజయ్‌కుమార్‌ను స్వయంగా సీటులో కూర్చోబెట్టిన  మంత్రి పువ్వాడ 

n ఉదయం 11.40 గంటలకు సంతకం చేసిన చైర్మన్‌

ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని, తాతా మధు 

n బాధ్యతలను చేపట్టిన సుడా డైరెక్టర్లు 

n సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడకు  కృతజ్ఞతలు : నూతన చైర్మన్‌ విజయ్‌కుమార్‌ 

n ప్రమాణస్వీకారోత్సవానికిపెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు

ఖమ్మం, జూన్‌ 19 : పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సంభ్రమాశ్చర్యాల నడుమ, పురోహితుల దీవెనలతో స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) తొలి చైర్మన్‌గా బచ్చు విజయ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం 11.41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన భార్య హిమబిందు, చిన్న కుమారుడు బాలు ఆర్యన్‌, ఇతర కుటుంబ సభ్యులు గట్టయ్యసెంటర్‌లో గల నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సుడా డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చైర్మన్‌ చాంబర్‌ను రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. పురోహితులు మంత్రాలు చదువుతుండగా విజయ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. మంత్రి పువ్వాడ స్వయంగా విజయ్‌కుమార్‌ను చైర్మన్‌ సీటులో కూర్చోపెట్టి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చైర్మన్‌ను శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మేయర్‌ పాపాలాల్‌, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు కూడా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. 

అభినందనల వెల్లువ..

సుడా నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బచ్చు విజయ్‌కుమార్‌, ఇతర డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు, టీఆర్‌ఎస్‌ నాయకులు  కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో కార్యాలయ ఆవరణం కిక్కిరిసింది.  శ్రీబాలాజీ ఎస్టేట్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వత్సవాయి రవి నూతన చైర్మన్‌ విజయ్‌కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన శాలువాతో సన్మానించారు. అలాగే, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పొన్నం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నగర నాయకులు పాలేపు వెంకటరమణ, ఖమ్మం జిల్లా మున్నూరుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, నెల్లూరి బుచ్చిబాబు, 18వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు గోళ్ల వెంకట్‌, నగర టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రసన్నకుమార్‌, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, మందడపు మనోహర్‌రావు, పాలడగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, ఆళ్ల శిరీష, ఊట్కూరి లక్ష్మీసుజాత, బానోత్‌ రామ్మూర్తినాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కనకం భద్రయ్య, రుద్రగాని ఉపేందర్‌, జశ్వంత్‌, బెల్లం వేణు, మంకెన నాగేశ్వరరావు, నున్నా మాధవరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి,  మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటరెడ్డి, పోట్ల వీరేందర్‌, మద్ది మల్లారెడ్డి, మక్బూల్‌, శీలంశెట్టి వీరభద్రం, తన్నీరు శోభారాణి, షేక్‌ షకీనా, వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 పాలక మండలి బాధ్యతగా మెలగాలి : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఏర్పడిన సుడా నూతన పాలక మండలి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, సుడా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. చైర్మన్‌గా విజయ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఖమ్మం నగరం రాష్ట్రంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాబోయే 40 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించామన్నారు. నాలుగు నియోజకవర్గాలు 8 మండలాల పరిధిలో గల 46 గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకొచ్చామని, వాటి అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలన్నారు. సుడాకు అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఖమ్మం నగరం హైదరాబాద్‌, వరంగల్‌ తరువాత మహానగరంగా ఆవిర్భవిస్తున్నదన్నారు. సుడా పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 

 సుడా చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు : బచ్చు విజయ్‌కుమార్‌ 

తనపై నమ్మకంతో చైర్మన్‌గా ఎంపికచేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా ప్రతినిధుల సహకారంతో సుడాను మరింత అభివృద్ధి చేస్తా. జిల్లాకు ఎంపీచెందిన, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో సుడాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తా. ప్రమాణస్వీకరోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 


logo