ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 19, 2020 , 02:53:47

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

n అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట

n పీహెచ్‌సీల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మున్సిపాలిటీలోని కమలాపురం, మణుగూరు కోటకట్ట, రాజుపేట, శేషగిరినగర్‌, భగత్‌సింగ్‌ నగర్‌ గ్రామాల్లో రూ. 70 లక్షలతో, మణుగూరు మండలంలోని అశోక్‌నగర్‌, సమితిసింగారం, కూనవరం గ్రామాల్లో రూ.56 లక్షలతో నిర్మించిన నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేద్రాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నిరకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మంచి మనసుతో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీఠ వేస్తున్నారన్నారు. మణుగూరు మున్సిపాలిటీ, మండలంలో నూతనంగా రూ.1.26కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీలను ప్రారంభించకున్నామన్నారు. కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, ఈఈ రాములు మున్సిపల్‌ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, డాక్టర్‌ మౌనిక, పీఏసీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కేవీ రావు,  టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, సర్పంచ్‌లు బచ్చల భారతి, ఏనిక ప్రసాద్‌, ఉప సర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌, ఎంపీటీసీ సభ్యులు గుడిపుడి కోటేశ్వరరావు, సరిత, టీఆర్‌ఎస్‌  మండల, పట్టణ నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌, ముద్దంగుల కృష్ణ, ఆర్‌ వెంకటరెడ్డి, వేముల లక్ష్మయ్య, రవి, తంతరపల్లి కృష్ణ, హర్షవర్థన్‌, రుద్ర వెంకట్‌, అడపా వెంకటేశ్వరరావు, ప్రభుదాసు, రమణయ్య, వెంకటసోములు, పప్పుల ప్రసాద్‌, రామారావు పాల్గొన్నారు.


logo