ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 19, 2020 , 02:53:49

నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను

నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను

n మంత్రి అజయ్‌ సూచనలతో ముందుకువెళ్తాం..

n ఎంపీ నామాతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటా..

n 46 గ్రామాల్లో సమాంతర అభివృద్ధి

n అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం 

n ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌

‘ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ దీవెనలతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆశీస్సులతో సుడా (స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చైర్మన్‌గా ఎంపికయ్యా.. సుడా తొలి చైర్మన్‌గా అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చా. పట్టుదల, ఓపికతో పని చేస్తే పార్టీ గుర్తిస్తుందని మరోసారి రుజువైంది.. నాపై నమ్మకం ఉంచి అధిష్ఠానం నాకు ఈ బాధ్యతలు అప్పగించింది.. ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సుడా సభ్యుల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా..’ అని సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ తెలిపారు.. ఇటీవల ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో ‘నమస్తే’తో ముఖాముఖి...                   -ఖమ్మం

నమస్తే : సుడా చైర్మన్‌గా మీ లక్ష్యం ఏమిటి?

బచ్చు విజయ్‌కుమార్‌ : మంత్రి పువ్వాడ నేతృత్వంలో సుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి పర్చడమే నా లక్ష్యం. సుడా మాస్టర్‌ ప్లాన్‌ను త్వరలోనే రూపొందిస్తాం. ఎనిమిది మండలాల్లో గల 46 గ్రామాల స్వరూపాలను మార్చబోతున్నాం. 2017లో సుడా ఏర్పాటు కాగా ఇప్పుడు పాలకవర్గం ఏర్పడింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయడం, బిల్డింగ్‌ అనుమతులను వెనువెంటనే ఇవ్వడంపై దృష్టి సారిస్తాం. 

నమస్తే : మీ కుటుంబ నేపథ్యం ?

విజయ్‌కుమార్‌ : మా పూర్వికులది ఇప్పటి వ రంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నేను పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. నాన్న రామారావు, అమ్మ ప్రభావతి. మేం ముగ్గురం అన్నదుమ్ములు, ఒక చెల్లి. నేను బీకాం, ఎల్‌ఎల్‌బీ చేశాను. సతీమణి హిమబిందు ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. పెద్ద కుమారుడు లలిత్‌ కునాల్‌ అ మెరికాలో ఎంఎస్‌ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బాలు ఆర్యన్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు.

నమస్తే : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు చైర్మన్‌ పదవి లభించడంపై స్పందన?

విజయ్‌కుమార్‌ : మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ముత్తాతల కాలం నాటి నుంచే రాజకీయాల్లో ఉన్నాం. మంత్రి పువ్వాడతోనే నా రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్నది. 2014 శాసనసభ ఎన్నికల నుంచి ఈరోజు వరకు పువ్వా డ వెంటే ఉన్నా. 2016లో కాంగ్రెస్‌ నుంచి ఆయన టీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా వచ్చా. ఆయన అప్పగించే ఏ పనినైనా చిత్తశుద్ధితో పూర్తి చేయడమే నా లక్ష్యం.  

నమస్తే : ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం  ఏవిధంగా తీసుకుంటారు?

విజయ్‌కుమార్‌ : మంత్రి అజయ్‌కుమార్‌తో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలే రు, వైరా ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లా వుడ్యా రాములునాయక్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సహకారంతో సుడాను అభివృద్ధి చేస్తాం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధిలో స మాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే మా ముం దు ఉన్న లక్ష్యం. ఎంపీ, ఎమ్మెల్యేల నిధులను కూ డా సుడా అభివృద్ధికి కేటాయించేలా కృషి చేస్తా.

నమస్తే : సుడా అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?

విజయ్‌కుమార్‌ : సుడా పరిధిలోని అన్ని ప్రాం తాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఇప్పటికే ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సుడా పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తాం. నిధులకు ఎలాంటి కొరత లేదు.  ఖమ్మానికి దీటుగా మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం.

నమస్తే : ఖమ్మం కార్పొరేషన్‌లో విలీన పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు?

విజయ్‌కుమార్‌ : మంత్రి అజయ్‌కుమార్‌ ఎమ్మెల్యేగా దాదాపు రూ.2 వేల కోట్లతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేశారు. కార్పొరేషన్‌లో విలీనమై న అర్బన్‌ మండలంలోని గ్రామాలతో పాటు ఇటీవల విలీనమైన ఖమ్మం రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఆశించిన రీతిలో జరగలేదు. సుడా ముందుగా విలీన పంచాయతీలపై దృష్టి సారిస్తుంది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైయిన్లను నిర్మిస్తాం.

నమస్తే : సుడా పరిధిలోని వచ్చే గ్రామాలు ఏవీ?

విజయ్‌కుమార్‌ : ఖమ్మం నగరానికి 25 కిలోమీటర్ల పరిధిలోని ఏడు మండలాల పరిధిలోని 46 గ్రామ పంచాయతీలు సుడా పరిధిలోకి వచ్చా యి. వీటిలో ఖమ్మం రూరల్‌ మండలంలోని అరెంపుల, ముత్తగూడెం, గూడూరుపాడు, తీర్థా ల, దారేడు, కామంచికల్‌, గోళ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, పల్లెగూడెం, పోలేపల్లి, ఎదులాపు రం, బారుగూడెం, గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి, తల్లంపాడు గ్రామాలున్నాయి. కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు, కూసుమంచి, ముదిగొండ మండలంలోని సువర్ణాపురం, ముదిగొండ, ఖానాపురం, కొత్త లక్ష్మీపురం, వెంకటాపురం, చింతకాని మం డలంలోని వందనం, కొదుమూరు, లచ్చగూడెం, బస్వాపురం, పందిళ్లపల్లి, చింతకాని, వైరా మండలంలోని వైరా, కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, కొణిజర్ల, అమ్మపాలెం, లింగగూడెం, గుండ్రాతిమడుగు, దుద్దిపుడి, పల్లిపాడు,  రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెం, రఘునాథపాలెం, చిమ్మపుడి, మంచుకొండ, కోయచెలక, రేగులచెలక గ్రామాలు ఉన్నాయి. 

నమస్తే : అక్రమ వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకొబోతున్నారు?

విజయ్‌కుమార్‌ : స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాలోని అనేక ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇదే క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగమూ పుంజుకుంది. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడా అక్రమ వెంచర్లు కూడా వెలుస్తున్నాయి. రా నున్న రోజుల్లో వాటిపై ఉక్కుపాదం మోపుతాం. కొనుగోలుదారులు డీటీపీసీ లే ఔట్‌ ఉన్న ప్లాట్లనే కొనుగోలు చేయాలి. అప్పుడే ఇబ్బందులుండవు.

నమస్తే : మాస్టర్‌ ప్లాన్‌ను ఎప్పుడు రూపొందిస్తారు?

విజయ్‌కుమార్‌ : సుడా మాస్టర్‌ ప్లాన్‌ను అతి త్వరలోనే రూపొందిస్తాం. ఇప్పటికే సుడా పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. ట్రాఫిక్‌, పబ్లిక్‌ స్థలాలు, రోడ్ల విస్తరణ, ఆసుపత్రులు, పార్కులు, పాఠశాలలు, 100, 60, 40 అడుగుల రోడ్ల నిర్మాణాలపై చర్చించాం. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. 

నమస్తే : సుడాతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

విజయ్‌కుమార్‌ : ఖమ్మంతో పాటు ఖమ్మం రూరల్‌, కూసుమంచి, ముదిగొండ, వైరా, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లో సుడాలో విలీనమైన గ్రామపంచాయతీల్లో రోడ్లు, డ్రైయిన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అడుగులు పడతాయి. ఆ గ్రామాల్లో ఎలాంటి నిర్మా ణం జరగాలన్నా సుడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భూవిక్రయాలు, ఇంటి, రహదారుల నిర్మాణాలు సుడా మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా సాగుతాయి. లే అవుట్‌ అనుమతులు ఇవ్వడం, అనుమతులు లేని భవన నిర్మాణాలను క్రమబద్ధీకరిం చే అధికారం కూడా సుడాకు ఉంటుంది. సుడా అనుమతి లేకుండారియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ఏర్పాటుకు అవకాశం ఉండదు. ఉద్యాన వనాలు, థియేటర్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక రవా ణా వ్యవస్థ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సుడా కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల అవుతాయి. వీటి ద్వారా మాస్లర్‌ ప్లాన్‌ ప్రకా రం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆహార వస్తువులు, కూరగాయల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, చెరువులు, కుంటలు అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచడంలో కూడా సుడా పాత్ర ఉంటుంది.

విజయ్‌ కుమార్‌ : డిగ్రీ చదివే రోజుల్లోనే కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశాను. 1990లో కాంగ్రెస్‌ నేత యూనిస్‌ సుల్తాన్‌కు చెందిన విద్యాసంస్థల్లో 16 ఏళ్లు పనిచేశా. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా యూనిస్‌ సుల్తాన్‌ పోటీ చేసినప్పుడు ఆయన గెలుపులో కీలకంగా పనిచేశా.  మాజీ మంత్రి మదన్‌మోహన్‌ మా బాబాయి. యూనిస్‌ సుల్తాన్‌ గెలిచిన తర్వాత ఏపీసీసీ కార్యదర్శిగా పనిచేశా. logo