గురువారం 16 జూలై 2020
Khammam - Jun 19, 2020 , 02:48:25

ఇంటర్‌లో ప్రైవేట్‌ విద్యార్థుల హవా

ఇంటర్‌లో ప్రైవేట్‌ విద్యార్థుల హవా

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రయి వేటు కళాశాలల విద్యార్థుల హవా సాగింది. అన్ని గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించారు. వీరిని ఆయా కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.


లిటిల్‌ ఫ్లవర్స్‌ కళాశాలలో...

భద్రాచలం: ఇంటర్‌ ఫలితాల్లో భద్రాచలానికి చెందిన ‘లిటిల్‌ ఫ్లవర్స్‌' విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంఈసీలో మనీశ్‌ 500 మార్కులకుగాను 495 సాధించినట్లు కళాశాల డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌ మాగంటి రమేశ్‌బాబు తెలిపారు. ఎంపీసీలో భార్గవ్‌ సాకేత్‌ 464, అభిరామ్‌రెడ్డి 462, బైపీసీ విభాగంలో ఎన్‌.తరుణిశ్రీ 426, సీఈసీలో వి.కిరణ్మయి 470 మార్కులు సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో  శ్రేయ 987 , పి.శ్వేత 981, ఎంపీసీ విభాగంలో గీతాచరణ్‌ 979, సాయికృష్ణ 979, ఎస్‌.అజయ్‌కుమార్‌ 975, నిత్యాన్వేశ్‌ 974, గీతాసాయి 974 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. వీరిని  ప్రిన్సిపాల్‌ మాగంటి రమేశ్‌బాబు, డైరెక్టర్‌ మాగంటి ప్రసాదబాబు, సీనియర్‌ అధ్యాపకుడు ఎండి. బషీర్‌ అభినందించారు.

ఆర్‌ఆర్‌కే వాహిని కాలేజీలో...

ఆర్‌ఆర్‌కే వాహిని కాలేజీ విద్యార్థులు సత్తా చాటినట్లు కళాశాల చైర్మన్‌ గూడపాటి వి.మహేశ్వరరావు, కరస్పాండెంట్‌ రేపల్లె మోహన్‌ సూర్యం తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో ఎ.సంజీవరెడ్డి 945, బి.విద్యాభారతి 922, టి.సంధ్య 906, జి.సాయిమానస 876, కె.కళ్యాణి 864, ఆర్‌.వసంత 912, ఐ.భార్గవి 896 మార్కులు సాధించారు. జూనియర్‌ ఇంటర్‌లో వై.నిఖిల్‌ కుమార్‌ 445, టి.సింధూశ్రీ కిరణ్మయి 437, ఎస్‌డి.షారుక్‌ పాషా 434, సిహెచ్‌.శివ 423, డి.దివ్యశ్రీ 418, ఎస్‌.ప్రవళిక 412 మార్కులు సాధించారు. సీఈసీ ప్రథమ సంవత్సరంలో పి.లక్ష్మి  476 మార్కులు సాధించింది. వీరిని కళాశాల చైర్మన్‌ గూడపాటి వి.మహేశ్వరరావు, కరస్పాండెంట్‌ మోహన్‌ సూర్యం, భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.

త్రివేణి కళాశాలలో...

త్రివేణి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. వీరిని చైర్మన్‌ కోడూరి సత్యనారాయణ అభినందించారు.

మారుతి కళాశాలలో...

మారుతి ఒకేషనల్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ బాలికల విభాగంలో ఎస్కే కలీషాబేగం 462, కె.ఉదయరాణి 457, ఎంపీహెచ్‌డబ్ల్యూ బాలికల విభాగంలో బానోతు శిరీష 903, ఎంఎల్‌టీలో కె.రాకేశ్‌ 435, కడాటి స్పందన 900 మార్కులు సాధించారు. వీరిని కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.ఎల్‌. కాంతారావు, చైర్మన్‌ డాక్టర్‌ బి.సుబ్బరాజు అభినందించారు.

కృష్ణవేణి కళాశాలలో....

లక్ష్మీదేవిపల్లి: ఇంటర్‌ జూనియర్‌, సీనియర్‌ ఫలితాల్లో కృష్ణవేణి జూనియర్‌ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఎల్‌.శివకేశవ్‌ 466, ఎస్‌కే ఆషిక్‌ 465, జి.సాయిగణేష్‌ 464, పి.మౌక్తిక్‌ 464, డి.సాయిశ్రీయ 463, చైతన్య 463, భావన 463, రేచల్‌ 460, బైపీసీలో ఎం.అనూష 435, ప్రీతాంబిక 433, పల్లవి 432, ఎంఈసీలో యశ్విపటేల్‌ 476, సీఈసీలో జి.పద్మశ్రీ 482 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో పి.వాసంతి 990, ఎస్‌కే బీబిరష్మా 985, ఉదయశ్రీ 981, బ్లెస్సీ జోసెఫిన్‌ 980, బైపీసీలో సాయిమహాలక్ష్మి 989 మార్కులు సాధించారు. వీరిని కళాశాల డైరెక్టర్‌ మాచవరపు కోటేశ్వరరావు అభినందించారు.

శ్రీ నలంద కళాశాలలో...

లక్ష్మీదేవిపల్లి: ఇంటర్‌ ఫలితాల్లో కొత్తగూడెం శ్రీ నలంద జూనియర్‌ కాలేజీ విద్యార్థులు జిల్లాస్థాయిలోనే అత్యధిక మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో మహ్మద్‌ ఆస్మా 465, వి.కౌశిక్‌కృష్ణ 465, ఎస్‌.మేఘన 465 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకుగాను ఎం.ఆయేష సిమ్రా 435, ఇ.జ్యోతి 433 సాధించారు. సీఈసీలో 500 మార్కులకుగాను జి.వివేక్‌ 486 సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. వీరిని కళాశాల చైర్మన్‌ లయన్‌ ఎంవీ చౌదరి, సీఈవో చైతన్యకృష్ణ, ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌, డైరెక్టర్‌ రాంబాబు అభినందించారు.

గాయత్రీ కళాశాలలో...

సత్తుపల్లి: పట్టణంలోని గాయత్రీ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్‌ మధుసూదనరావు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఎండి.మహ్మద్‌పాషా 461 మార్కులతో టౌన్‌ థర్డ్‌, సిహెచ్‌.భాగ్యలక్ష్మి 460 మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీలో కె.సౌర్యతేజ 410, ఎ.హిమబిందు 405, సీఈసీలో పి.వెంకటదుర్గ మురళి 451, జె.కల్యాణి 438, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో డి.సువర్ణమల్లిక 985 మార్కులతో టౌన్‌ సెకండ్‌, సిహెచ్‌.మహేశ్వరి 960, కె.జయంత్‌ 960, బైపీసీలో వి.హరిణి 938, సీఈసీలో హెచ్‌.శ్రీనివాసరావు 882 మార్కులు సాధించినట్లు వివరించారు. వీరిని కరస్పాండెంట్‌ కె.మధుసూదన్‌రావు, ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.సుబ్బారావు, డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, జి.వీరారెడ్డి, ఎం.శ్రీధర్‌ అభినందించారు.

శ్రీవిద్య, కృష్ణవేణి కళాశాలల్లో...

మణుగూరు: శ్రీవిద్య, కృష్ణవేణి జూనియర్‌ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో ఎస్‌కే అంజూమ్‌బేగం 460, ఎ.శివాణి 454, కె.మానస 454, బైపీసీలో ఎస్కే సల్‌మా 415, సీఈసీలో కె.టెండూల్కర్‌ 454 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వి.హిమవర్షిణి 975, ఎన్‌.హిమవర్షిణి 974, పి.శ్రీలేఖ 964, బైపీసీలో కె.భార్గవి 968, సీఈసీలో పి.అక్షిత 948 మార్కులు సాధించారు. వీరిని కరస్పాండెట్‌ పుచ్చకాయల శంకర్‌, ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు, డైరెక్టర్‌ సారంగపాణి అభినందించారు.


logo