ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 16, 2020 , 03:12:50

ఫలించనున్న ఎంపీ నామా కృషి

ఫలించనున్న ఎంపీ నామా కృషి

  • మధిరలో రైల్వే అండర్‌ బ్రిడ్జి  నిర్మాణానికి సన్నాహాలు 
  • రైల్వే జీఎం నుంచి ఎంపీ క్యాంప్‌  కార్యాలయానికి సమాచారం 

ఖమ్మం : టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషి, చొరవ ఫలితంగా మధిరలో నూతన రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మధిరలో మూసివేసిన రైల్వేగేటు స్థానంలో అండర్‌ బ్రిడ్జి నిర్మించేందుకు రైల్వేశాఖ త్వరలో ప్రతిపాదనలు రూపొందించి, సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమాలోచనల అనంతరం ప్రారంభించే అవకాశముంది. దీంతో పట్టణవాసుల కష్టాలు తీరనున్నాయి.

ఎంపీ నామా ఎన్నిక అనంతరం నిర్వహించిన మధిర నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశంలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు సత్వరం పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకున్న విషయం విదితమే. అందులో భాగంగానే స్థానిక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, పట్టణ ప్రజలు రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ విషయమై ఎంపీ నామా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాకు లేక రాశారు. ఈ విషయమై రైల్వే జీఎం గజానన్‌ మాల్యా స్పందించి, మధిర పట్టణంలో ఆర్‌యూబీ కట్టాల్సిన ఆవశ్యకత ఉందని, తగిన చర్యలు తీసుకుంటామని లేఖ ద్వారా ఖమ్మంలోని ఎంపీ కార్యాలయానికి సోమవారం తెలిపారు. దీంతో ఎంపీ నామా కృషిని మధిర పట్టణ ప్రముఖులు, ప్రజలు అభినందించారు. ఎంపీ చొరవతో అండర్‌ బ్రిడ్జి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. logo