బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 14, 2020 , 02:35:56

రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం

రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం

  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

చింతకాని: రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలో లచ్చగూడెంలో శనివారం ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనపంతరం గ్రామంలోని గోదాములో సర్పంచ్‌ గురజాల ఝాన్సీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమొస్తది.. అన్న వలస పాలకుల కళ్లు చెదిరేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఒకనాడు విద్యుత్‌ సరఫరా అయితే వార్త, ఇప్పుడు కరెంట్‌ పోతే వార్త అని అన్నారు. పల్లెల్లో రైతాంగం ఒక్కచోట సంఘటితం అయ్యే విధంగా సీఎం కేసీఆర్‌ రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీటి కోసం రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుందని, తర్వాత సాగునీటి సమస్యలు ఉండవని అన్నారు.సాగర్‌ నీటిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. వలస పాలకులు ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ పేరిట ఉపయోగం లేని కాల్వలు తీయించారని, ఇప్పుడు రైతు దీక్షల పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు లాఠీల దెబ్బలు తిన్నారని, రాయితీలు, ఎరువులు పొందడానికి చెప్పులు వరుసలుగా పేర్చిన సంగతి మర్చిపోలేదన్నారు. సమైక్య పాలనలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారన్నారు. సీతమ్మ బరాజ్‌ పూర్తయ్యాక పాలేరు కాల్వ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు పారిస్తామన్నారు. మంత్రి వెంట ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అతిథులుగా కొండబాల కోటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరరావు, రాయల శేషగిరిరావు, విజయనిర్మల, వైస్‌ ఎంపీపీ గురజాల హనుమంతరావు, తాతా ప్రసాద్‌, గురజాల కృష్ణ, సైదేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతుబంధు సమితి నాయకులు కిలారు మనోహర్‌, మంకెన రమేశ్‌, వంకాయలపాటి సత్యనారాయణ, లచ్చయ్య, కన్నెబోయిన కుటుంబరావు, చల్లా అచ్చయ్య, సోసైటీ చైర్మన్‌ కోండపల్లి శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీఓ లలితకుమారి, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్‌, ఎంపీపీ పూర్ణయ్య పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసమే రైతువేదికలు

బోనకల్లు: రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం బోనకల్లు మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. రైతువేదికల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సాగు సలహాలు అందనున్నాయన్నారు. దిగుబడి, మార్కెటింగ్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం రైతు బీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తున్నదన్నారు. అనంతరం నియంత్రణ సాగుకు సంబంధించిన బ్రోచర్లోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీఏవో ఝాన్సీకుమారి, తహసీల్దార్‌ రాధిక, ఎంపీడీవో శ్రీదేవి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా సమితి సభ్యులు మందడపు తిరుమలరావు, మండల కన్వీనర్‌ ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం నాయకులు భుక్యా సైదానాయక్‌, చావా వెంకటేశ్వరరావు, మోర్ల శ్రీనివాసరావు, కల్యాణం నాగేశ్వరరావు, బాణోతు కొండ, కొనకంచి నాగరాజు, గద్దల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. logo