బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:12:58

సుడా అభివృద్ధికి కృషి

 సుడా అభివృద్ధికి కృషి

n కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదేశానుసారం  నిధుల రాక

n మంత్రి అజయ్‌ సహకారంతో ముందడుగు 

n 19న ప్రమాణస్వీకారం 

n సుడా నూతన చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ 

ఖమ్మం : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అడుగుజాడల్లో పయనిస్తూ సుడా పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నూతన చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని వీడివోస్‌ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సలహా మండలి సభ్యులతో కలిసి మాట్లాడారు. ఖమ్మం శాసనసభ్యుడిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉన్న సమయంలోనే దాదాపు రూ. 2 వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గాభివృద్ధికి కృషి చేశారని, తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటిదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల దీవెనలతో తనపై నమ్మకంతో చైర్మన్‌గా నియమించినందుకు విజయ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు.  ఖమ్మం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలల్లో గల 46 గ్రామాల అభివృద్ధికి  కృషి చేస్తానన్నారు.  వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి,  ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌,  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు సుడా పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మంత్రి అజయ్‌కుమార్‌ సహకారం ఉంటుందని చెప్పారు. ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ అభివృద్ధికి పాటుపడుతామన్నారు. తెలంగాణలో అనేక నగరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని, సుడాకు కూడా ఆ విధమైన సహకారమే ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. logo