శనివారం 11 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:12:12

కేసీఆర్‌ పాలనలోనే అభివృద్ధి..

కేసీఆర్‌ పాలనలోనే అభివృద్ధి..

n సీఎంతోనే పోడు  సమస్యకు  పరిష్కారం  

n అడవులను కాపాడటం  సామాజిక బాధ్యతగా తీసుకోవాలి

n సీతారామ ప్రాజెక్టుతో  జిల్లా సస్యశ్యామలం

n రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

n మాధారంలో సీసీరోడ్లు, ఏన్కూరులో రైతువేదిక భవనానికి శంకుస్థాపన

 కారేపల్లి రూరల్‌ : కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పోడు భూమి సాగుదారుల సమస్యలకు సీఎం కేసీఆర్‌ పరిష్కారం చూపుతారని అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధారం ఉమ్మడి గ్రామపంచాయతీలకు మంజూరైన రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్ల నిర్మాణానికి మంత్రి పువ్వాడ , ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ...అటవీ హక్కు పత్రాలు పొందిన రైతులను ఫారెస్టు అధికారులు ఇబ్బంది పెట్టకూడదన్నారు.   కొత్తగా అడవులను నరకొద్దని, వాటిని కాపాడటం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. బాపూజీ కళలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్‌ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,  కలెక్టర్‌ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఎంపీపీ మాళోతు శకుంతల, జడ్పీటీసీ వాంకుడోతు జగన్‌, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మకమిటీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షకార్యదర్శులు తోటకూరి పిచ్చయ్య, అజ్మీరా వీరన్న తదితరులు పాల్గొన్నారు. 

షాదీఖాన ప్రారంభం

కారేపల్లి :  రూ.30లక్షల వ్యయంతో మండల కేంద్రంలో నిర్మించిన షాదీఖానాను శుక్రవారం మంత్రి పువ్వాడ ప్రారంభించారు. 

వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు

ఏన్కూరు: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మారావుపేటలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ..  రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేసి రైతు సంక్షేమానికి విశేష కృషి  చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, ఆర్డీవో శివాజీ, ఏవో ఎ. నర్సింహారావు, ఎంపీడీవో అశోక్‌, తహసీల్దార్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 


logo