గురువారం 02 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:11:00

బీటీపీఎస్‌ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు

 బీటీపీఎస్‌ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు

n తొలివిడుతలో 168 మందికి  ఇచ్చేందుకు జెన్‌కో గ్రీన్‌ సిగ్నల్‌ 

n రెండో విడుతలో మరో 178కి..

n మంత్రి కేటీఆర్‌ చొరవతో నియామకాలు

n రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

మణుగూరు : బీటీపీఎస్‌ భూ నిర్వాసితులకు త్వరలోనే పర్మినెంట్‌ ఉద్యోగాలు రానున్నాయి. ఇందుకు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పది రోజుల్లో  నియామక పత్రాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల్లో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (బీటీపీఎస్‌) వల్ల భూములు కోల్పోయి  నిరాస్వితులైన వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో  జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావుతో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భేటీ అయ్యారు.  తొలి విడతగా  168 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు  జెన్‌కో సీఎండీ అంగీకరించినట్లు రేగా తెలిపారు. పది రోజుల్లోగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారని చెప్పారు. మరో 178 మందికి  రెండో యూనిట్‌ పూర్తికాగానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా అంగీకరించినట్లు తెలిపారు.   ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్‌ భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు  ప్రత్యేకంగా ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీని చెల్లించింది.  ఇప్పడు   భూములు కోల్పోయిన  నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తున్నది. ఈ శుభవార్తతో  బీటీపీఎస్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న భూనిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  2015 మార్చి 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇటీవల  తొలి యూనిట్‌ నుంచి  విద్యుత్‌ ఉత్పత్తి కూడా ప్రారంభం కావడంతో  ఈ ప్రాంత ప్రజలు హర్షం 

వ్యక్తం చేస్తున్నారు. 


logo