గురువారం 16 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:08:00

పాతాళ గంగ పైపైకి..

పాతాళ గంగ పైపైకి..

n 0.41 మీటర్లు పైకి వచ్చిన భూగర్భజలాల సగటు

n జిల్లాలో 2025 వరకూ నీటి వనరులు 

n గుండాల మండలంలో  4.19 మీటర్ల లోతులోనే నీళ్లు

కరోనాతో నీటి వినియోగం స్వల్పం.. 

కరోనా ప్రభావంతో రెండు నెలలపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో నీటి వినియోగం కూడా కొంతమేరకు తగ్గింది. ఇంటి అవసరాల నిమిత్తం నీటిని వినియోగించుకున్నప్పటికీ భూగర్భజలాలు ఆశించినస్థాయిలో నిలకడగానే ఉంది. దీనికి తోడు జిల్లాలో మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగినందున భూగర్భ జలాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలను అంచనా వేసేందుకు ఆ శాఖ అధికారులు 66 ఫిజియో మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా  గణాంకాలను పరిశీలిస్తే.. గుండాల మండలం కాచనపల్లిలో అత్యంత తక్కువ లోతులోనే (4.19 మీటర్లు) నీరు లభ్యమవుతున్నది. దమ్మపేట మండలం మందలపల్లిలో అత్యంత ఎక్కువ లోతులో (38.10 మీటర్లు) నీరు లభిస్తున్నది. నిరుటి మే నెలలో సగటున 11.33 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉండగా.. ఈ ఏడాది మే నెలలో 10.92 మీటర్ల లోతులోనే ఉంది. అంటే 0.41 మీటర్ల మేర భూగర్భజలాలు పైకి వచ్చాయి. వీటి వినియోగించడంలో దమ్మపేట, జూలూరుపాడు మండలాలు ముందు వరుసలో ఉన్నాయి. అత్యంత తక్కువగా వినియోగిస్తున్న మండలాలు ఆళ్లపల్లి, గుండాల. 

భూగర్భజలాలు నిలకడగానే ఉన్నాయి..

 ప్రస్తుతానికైతే 2025 సంవత్సరం వరకు నీటి వనరులకు ఇబ్బందులు లేవు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు, పరిశ్రమల యజమానులు మొత్తమ్మీద 27 శాతం మాత్రమే భూగర్భజలాలను వినియోగించుకుంటున్నారు. దమ్మపేట మండలంలో  భూగర్భ జలాల అత్యధిక వినియోగం ఉంది. మిషన్‌ కాకతీయ పథకం వల్ల భూగర్భ జలాలు విరివిగా పెరిగాయి.

- ఎం.బాలు, జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి, కొత్తగూడెం

Next Article ఐఐపీ -55.5%

logo