మంగళవారం 07 జూలై 2020
Khammam - Jun 12, 2020 , 01:37:30

నేడు జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటన

నేడు జిల్లాలో  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటన

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించనున్నట్లు మంత్రి వ్యక్తిగత సహాయకుడు సి.హెచ్‌.కిరణ్‌ గురువారం తెలిపారు. ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 10.15 గంటలకు  జిల్లాలోని కారేపల్లి మండలం మాదారానికి చేరుకుంటారు. సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు కారేపల్లిలో నూతనంగా నిర్మించిన షాదీఖానాను ప్రారంభించనున్నారు. అనంతరం 10.45 గంటలకు కారేపల్లి నుంచి బయలుదేరి 11.10 గంటలకు ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామానికి చేరుకుంటారు. రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి ఖమ్మం చేరుకుంటారు.logo