ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 12, 2020 , 01:34:16

‘సుడా’ చైర్మన్‌గా బచ్చు విజయ్‌కుమార్‌

    ‘సుడా’ చైర్మన్‌గా బచ్చు విజయ్‌కుమార్‌

  • మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నియామక పత్రాలు
  • 15 మంది సభ్యులతో అడ్వయిజరీ బోర్డు
  • శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌గా బచ్చు విజయకుమార్‌ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ నెల 10న జీవో నంబర్‌ 233 జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా విజయ్‌కుమార్‌ నియామకపత్రం అందుకొన్నారు. మంత్రుల వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తదితరులున్నారు. చైర్మన్‌తోపాటు 15 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరంతా మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం నగర ప్రగతికి కృషిచేయాలని మంత్రి పువ్వాడ నూతన చైర్మన్‌ విజయ్‌కుమార్‌ను కోరారు. ప్రధాన నగరాలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అందుకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఖమ్మం నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

వైస్‌ చైర్మన్‌గా ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్‌, సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు.బోర్డు సభ్యులుగా ఖమ్మం నగరానికి చెందిన కోసూరి రమేశ్‌గౌడ్‌, దొంగల తిరుపతిరావు, కొల్లు పద్మ, పులిపాటి ప్రసాద్‌, పల్లా కిరణ్‌, మాటూరి లక్ష్మినారాయణ, ముక్తార్‌ షేక్‌, ఎండీ ఖాదర్‌ అలీ, దేవబత్తుని కిశోర్‌కుమార్‌, మందడపు నర్సింహారావు, అజ్మీరా వీరూనాయక్‌, మందడపు రామకృష్ణ, గూడా సంజీవరెడ్డి (పాలేరు), బండారు కృష్ణయ్య (వైరా), చల్లా అచ్చయ్య (మధిర) నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రధాన అనుచరుడైన విజయ్‌కుమార్‌నే సుడా చైర్మన్‌ పదవి వరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేయగా తొలి చైర్మన్‌గా విజయ్‌కుమార్‌ ఎన్నిక కావడం విశేషం. logo