మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 12, 2020 , 01:27:31

స్థానికంగానే కరోనా చికిత్స

స్థానికంగానే కరోనా చికిత్స

  • మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు
  • అప్రమత్తంగా  వైద్యారోగ్యశాఖ
  • కొత్తగూడెంలో వ్యాధి నిర్ధారణ కేంద్రం
  • రూ.18 లక్షల నిధులతో ఏర్పాటు
  • పాజిటివ్‌గా తేలితే జిల్లా కేంద్రాల్లోనేవైద్య చికిత్స

ప్రపంచాన్ని కరోనా గజగజ వణికిస్తున్నది.. రాష్ట్రంలో    నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నది.. మున్ముందు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నది..                      మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ చర్యలు   తీసుకుంటున్నది.. ప్రస్తుతం కరోనా బాధితులకు    హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య చికిత్స   అందుతుండగా ఇకపై పాజిటివ్‌ కేసులు వస్తే జిల్లా  కేంద్రాల్లోనూ చికిత్స అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నది.. ఇందులో భాగంగా ఖమ్మం, కొత్తగూడెంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నది.. కొత్తగూడెంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు  రూ.18 లక్షల వ్యయంతో టెస్టింగ్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నది.. దీంతో కేసుల నిర్ధారణ స్థానికంగానే జరుగనున్నది. 

-ఖమ్మం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం

కరోనా వైరస్‌ను అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ముందునుంచే అప్రమత్తంగా ఉంది. తక్షణ చర్యలు చేపట్టి వైరస్‌ను అరికడుతుంది. కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసిన ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు చేపడుతున్నది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నది. అనుమానితులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి పర్యవేక్షిస్తున్నది. నిరంతరం వైద్యల పర్యవేక్షణలో బాధితులు త్వరగా కోలుకునే విధంగా నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలను అందించేందుకు జిల్లా కేంద్రంలో అదనంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డు, రఘునాథపాలెం మండల కేంద్రంలోని శారద కళాశాలలో 500 పడకలు, వరంగల్‌ క్రాస్‌రోడ్డు సమీపంలోని స్వర్ణభారతి ట్రైనింగ్‌ సెంటర్‌లో 300 పడకలు, మద్దులపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 100 పడకలను ఏర్పాటు చేశారు. జలుబు, దగ్గు, జర్వం, శ్వాసకోశ ఇబ్బందులతో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా ప్రభుత్వ దవాఖానకు వచ్చి చికిత్స పొందుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఖమ్మం నగర కేంద్రంలోని ఐసోలేషన్‌వార్డులో ఉంచి వారికి పరీక్షలు నిర్వహించి నమూనాలను వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలకు పంపుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. వ్యాధి లక్షణాలు కనిష్టస్థాయిలో ఉన్న వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు. 

అత్యవసరం అయితే ఐసోలేషన్‌కు తరలింపు

కరోనా పాజిటివ్‌ బాధితుల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటేనే ఐసోలేషన్‌ వార్డులకు తరలించనున్నారు. మామూలుగా ఉన్న వ్యక్తులకు మాత్రం ఇంటికే పరిమితం చేసి వారికి ప్రభుత్వ వైద్యశాల నుంచి మందులు, చికిత్సలు చేయనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను ఎప్పటిలాగే హోం క్వారంటైన్‌ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ప్రతిరోజు వైద్య సిబ్బంది సర్వేలు చేసి రెడ్‌ జోన్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని స్టాంపింగ్‌ చేసి ఇంటికే పరిమితం చేయనున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచం నుంచి దిగినా, గది బయటకు వచ్చినా మాస్క్‌ ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్‌ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని చెత్తబుట్టలో వేయాలి. రోజుకు కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి. చేతులను సబ్బుతో కడుక్కోవాలి. క్వారంటైన్‌లో ఉన్న కరోనా పాజిటివ్‌ వ్యక్తి తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరిచేందుకు క్రిమిసంహారం లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ను వేసి వినియోగించాలి. ఊపిరితిత్తులపై ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. బాధితుడు తనకు కేటాయించిన దుస్తులను వేడినీటిలో డెటాల్‌ వేసి అరగంట నానబెట్టి, ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వైద్యుడి సూచనల మేరకు కచ్చితంగా మందులు వాడాలి. బాధితుడు ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అస్వస్థత లక్షణాలు తీవ్రమైనా కొత్త లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యసహాయం పొందాలి. దగ్గు, గొంతునొప్పి, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారటం, విపరీతమైన జ్వరం, చాతీలో నొప్పి లేదా నొక్కినట్లు కనిపించడం, లేవలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యసహాయం పొందాలని చెబుతున్నారు.  

కొత్తగూడెంలో కరోనా టెస్టింగ్‌ సెంటర్‌

తొలి సారిగా ఉమ్మడి జిల్లాలో కరోనా టెస్టింగ్‌ కేంద్రం మంజూరైంది. ఇందుకోసం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న టీబీ సెంటర్‌లోనే టెస్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఈ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే టీబీ సెంటర్‌లో రెండు టెస్టింగ్‌ మిషన్లు ఉండగా మరో మూడు ‘ట్రూ నాట్‌' పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం రూ.18 లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక గంటలోనే పాజిటివ్‌ ఉందా లేదా అనే రిపోర్టును ఇచ్చేందుకు ఈ టెస్టింగ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అప్రమత్తంగా ఉండాలి...

వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానిత లక్షణాలు ఉంటే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతికదూరం పాటించాలి. కరోనా బాధితులకు జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అదనంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య యంత్రాంగం సిద్ధంగా ఉంది. హోం క్వారంటైన్‌లో జాగ్రత్తలు పాటించాలి. పౌష్ఠికాహారం తీసుకోవాలి. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలి. 

-డీఎంహెచ్‌ఓ మాలతి, ఖమ్మం


 కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌  క్వారంటైన్‌ సెంటర్ల పరిశీలన

ఖమ్మం, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజలకు ఆందుబాటులో వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశామని వివరించారు.  గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు  చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని మౌలిక వసతులను  పరిశీలించారు. సిబ్బంది చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని వివరించారు. వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని  వసతులను కల్పించి ఆదుకుంటున్నట్లు తెలిపారు.  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా జిల్లా కేంద్రంలో 120 పడకలు ఏర్పాటు చేశామన్నారు. వ్యాధిగ్రస్తుల కోసం ఎనిమిది వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని, సెంట్రలైజ్‌ ఆక్సిజన్‌ను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిప్టుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతర సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా  వైరస్‌   అరికట్టగలుగుతామని  


logo