గురువారం 09 జూలై 2020
Khammam - Jun 11, 2020 , 02:43:45

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

  • పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
  • వృథా నీటి నిల్వలతో దోమల వ్యాప్తి
  • ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ 
  • చింతకాని,   ముదిగొండ మండలాల్లో  పర్యటన

చింతకాని: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ గ్రామస్తులకు సూ చించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలితో మండలంలోని నాగులవంచ గ్రామంలో పర్యటించి మాట్లాడారు. క్రమం తప్పకుండా డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, ఇం కుడు గుంతలను నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఎన్నెస్పీ క్వార్టర్స్‌ సమీపంలోని సుమారు 15 ఇండ్లను పరిశీలించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలపై ఆరా తీశారు. వానకాలంలో విషజ్వరాలు వేగంగా సంక్రమిస్తాయని, మురుగు నీటి ని ల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు భాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. బావుల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని, వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలన్నారు. వృథా నీటిలో గంబూషియా చేపలు వదలాలన్నారు. రోడ్ల వెంట నీటి నిల్వలు, పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ ఆ లస్యం నాగమణి, ఎంపీడీవో లలితకుమారి, ఎంపీ పీ పూర్ణయ్య, కార్యదర్శి కోటా రాహుల్‌, వైద్య సిబ్బంది వీరేంద్ర, వేమిశెట్టి కృష్ణారావు, వార్డు స భ్యులు ఎ. బసవయ్య, వి. సత్యనారాయణ, వెంకటలచ్చయ్య, ఎం. సుబ్బారావు పాల్గొన్నారు.

ఒక్క డెంగీ కేసు నమోదు కావొద్దు.. 

ముదిగొండ : బాణాపురంలో ఒక్క డెంగీ కేసు నమోదు కావొద్దని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు. బుధవారం ఆయన గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి మాట్లాడారు. గతేడాది పదుల సంఖ్యలో డెంగీ, వందల సంఖ్యలో వైరల్‌ జ్వరాల కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది అ లాంటి పరిస్థితి ఉత్పన్నం కావొద్దన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తేనే వ్యాధులకు దూరంగా ఉంటామన్నారు. గ్రామంలో పాడుబడిన బావులను పూడ్చి అక్కడ పూల మొక్కలు నాటడంపై, నర్సరీ సంరక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ స్నేహలత, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మలేరియాఅధికారి సైదులు, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీఓ సూర్యనారాయణ, సర్పంచ్‌ ఆవుల రమ  ఉన్నారు.


logo