గురువారం 09 జూలై 2020
Khammam - Jun 09, 2020 , 04:59:52

పల్లె, పట్టణ ప్రగతిలో ఖమ్మం జిల్లాకు రెండో స్థానం

పల్లె, పట్టణ ప్రగతిలో  ఖమ్మం జిల్లాకు రెండో స్థానం

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • తల్లాడలోని షాపుల్లో  ఆకస్మిక తనిఖీ
  • పరిశుభ్రత పాటించని  నిర్వాహకుడికి  జరిమానా 

తల్లాడ : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలు కావాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంజనాపురంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత గ్రామంలో రూ.1.10కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌స్లాన్‌ నిధులతో అంజనాపురం ఎస్సీకాలనీ నుంచి బిల్లుపాడు ఎస్సీకాలనీ వరకు నిర్మించనున్న సీసీరోడ్డు, సైడ్‌కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో పారిశుధ్యం పకడ్బందీగా నిర్వహించాలని, పరిశుభ్రమైన పల్లెలు మానవ మనుగడకు, ఆరోగ్యానికి నిలయాలుగా మారుతాయన్నారు. ఖమ్మం జిల్లా పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ఇంకుడుగుంతల నిర్మాణంలో రాష్ట్రంలో  రెండోస్థానంలో ఉందన్నారు.

అందుకు కృషిచేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆరేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన మహానాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో లక్షా 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సర్పంచ్‌ కొమ్మినేని విద్యాసాగర్‌రావు, ఎంపీటీసీ కొమ్మినేని ప్రభాకర్‌రావు, తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, శీలం కోటారెడ్డి, కొట్టేటి సంధ్యారాణి, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, తూము వీరభద్రరావు, బద్ధం కోటిరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

షాపు నిర్వాహకునికి ఫైన్‌.. 

పారిశుధ్య కార్యక్రమాల ముగింపు సందర్భంగా తల్లాడలో మంత్రి పువ్వాడ అజయ్‌ షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. షాపు షాపునకు తిరిగి పారిశుధ్యాన్ని, పరిశుభ్రతను పరిశీలించారు. ఓ దు కాణం ముందు చెత్త ఉండటంతో జరిమానా వే యాలని సర్పంచ్‌ సంధ్యారాణిని ఆదేశించారు. చే పల వ్యాపారి వద్దకు వెళ్లి పరిశుభ్రతను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు.   

రైతుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే రైతువేదికలు

కల్లూరు : రైతుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రైతువేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొర్లగూడెంలో ఎమ్మెల్యే సండ్ర అధ్యక్షతన సర్పంచ్‌ బైరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్‌లో రైతులు ఏ నేలల్లో ఏ ఏ పంటలు వేయాలో చర్చించుకునేందుకు చక్కని వేదికలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.  అనంతరం ఎంపీ నామా మాట్లాడుతూ.. రైతుల పాలిట పెన్నిధిగా తెలంగాణ ప్రభుత్వపాలన సాగుతుందని, సీఎం కేసీఆర్‌ చేస్తున్న పలు సంక్షేమ పథకాలు రైతులు, బలహీన, బడుగు వర్గాలకు లబ్దిచేకూర్చుతున్నాయన్నారు.

కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లను ఏర్పాటు చేశారని, అందులో నాలుగు క్లస్టర్లకు ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రైతువేదికలకు స్థలాలు ఇచ్చేందుకు మధిరలో ఇప్పటికే రైతులు పోటీపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాప్రయోజనాలు, రైతుసంక్షేమం కోసం చేపట్టిన ప్రతి పథకం ఆదర్శవంతమేనని అన్నారు. సీఎం కేసీఆర్‌, వ్యవసాయశాఖ అధికారులు సూచించిన విధంగా పంటలు సాగుచేయాలని, వరిలో సన్నరకం విత్తనాలు, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలను అంతర పంటలుగా సాగుచేసుకుంటే అధిక డిమాండ్‌ ఉండటంతో పాటు మద్దతు ధర కూడా ఉంటుందని, రైతులు ఆ దిశగా నూతన వ్యవసాయ సాగు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జేడీఏ ఝాన్సీలక్ష్మి, సెంట్రల్‌బ్యాంకు డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్‌రావు, లక్కినేని రఘు, సొసైటీ చైర్మన్లు నర్వనేని అంజయ్య, చావా వెంకటేశ్వరరావు, పాలెపు రామారావు, కీసరి వెంకటేశ్వరరెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో రూప, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులు ఇస్మాయిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాటంనేని వెంకటేశ్వరరావు, దేవరపల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.logo