శనివారం 04 జూలై 2020
Khammam - Jun 08, 2020 , 03:05:44

పాలేరులో ప్రారంభమైన చేపల వేట

పాలేరులో ప్రారంభమైన చేపల వేట

  • ఉమ్మడి జిల్లాలో జోరందుకోనున్న విక్రయాలు
  • డిమాండ్‌ మేరకు ధర పెంచనున్న మత్సకారులు

ఖమ్మం/కొత్తగూడెం :  మృగశిర కార్తె నేటి నుంచి ప్రవేశిస్తుంది. వడగళ్ల వాన.. ఈదురు గాలులకు ఈ కార్తె ప్రత్యేకత..   మృగశిర ప్రవేశం రోజు  మత్స్యకారులకు  పెద్ద పండుగ..  ఈరోజున చేపలు తింటే పలు రోగాలు నయమవుతాయని వైద్య శాస్త్రం చెబుతున్నది. ప్రధానంగా ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు నయమవుతాయని నమ్మకం. ఈరోజున చేప ప్రసాదం తీసుకుంటే సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం. దీంతో రకరకాల చేపలను కొనుగోలు  ఆసక్తి చూపుతున్నారు.   బంగారుతీగ, కొర్రమీను, పులస, బొచ్చె తదితర చేపలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గతంలో కేజీ కొర్రమీను  రూ.300-350 వరకు, తెల్లచేపలు రూ. 123-150 వరకు ఉండేది.  ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చేపల ఉత్పత్తి ఆశజనకంగానే ఉంది. డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సైతం నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.

మృగశిర కార్తె సందర్భంగా కొర్రమీను నల్లచేపలు కేజీ రూ.400-500 వరకు పలికే అవకాశం ఉంది. అదేవిధంగా తెల్ల చేప కేజీ రూ. 200 వరకు ఉంటుందని అంచనా. ఆదివారం నుంచి పాలేరు, వారం రోజుల నుంచి వైరా రిజర్వాయర్‌లో చేపల వేట కొనసాగుతున్నది.  తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాల నుంచి మత్స్య కార్మికులకు ఉచిత చేపపిల్లలను పంపణీ చేస్తుండటంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా  అనావృష్టి కారణంగా చెరువులు, కుంటలు ఎండి పోవడం మత్య్స ఉత్పత్తిపై  తీవ్ర ప్రభావం చూపింది. ఏది ఏమైనా ఈ ఏడు చేపల ప్రియులకు మృగశిర కార్తె  రోజున  అవసరమైన మేర అందించేందుకు గాను మత్స్య కార్మికులు ఏర్పాట్లు చేశారు. 

ఏటా మన చేపలే .. 

గతంలో మృగశిర వచ్చిందంటే చాలు చేపలకోసం దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి మన చేపలు మనదగ్గరే ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలని. మత్యకారులలకు వందశాతం సబ్సిడీతో చెరువుల్లో పిల్లలను వదలడం జరిగింది. ఇప్పడు మత్స్యసంపద పుష్కలంగా ఉంది.

చేపలకు కొదవలేదు. :వరదారెడ్డి. జిల్లా మత్స్యశాఖ అధికారి

చేపల వేటలో విషాదం జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి.. చేపల వేట విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పాలేరు జలాశయంలో మొదటి రోజే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతిచెందాడు. ఏన్కూరు మండలంలో మరో వ్యక్తి చేపల కోసం వెళ్లి సాగర్‌ కాల్వలో మునిగి మృతిచెందాడు. ఈ రెండు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.. రిజర్వాయర్‌లో పడి మత్స్యకారుడు.. కూసుమంచి: చేపల వలలు వేసేందుకు వెళ్లిన మత్స్య కారుడు ప్రమాద వశాత్తు పాలేరు రిజర్వాయర్‌లో పడి మరణించిన ఘటన ఆదివారం నాయకన్‌గూడెంలో చోటు చేసుకుంది. చేపల వేట రోజే మత్స్యకారుడు మృతి చెందటంతో నాయకన్‌గూడెంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన మండల వీరబాబు (32) చెరువులోకి వలలు వేసేందుకు ఆదివారం మధ్యాహ్నం వెళ్లాడు. రిజర్వాయర్‌లో వలలు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో గల్లంతయ్యాడు. సుమారు 3 గం

చేపల వేటలో విషాదం

జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి..

చేపల వేట విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పాలేరు జలాశయంలో మొదటి రోజే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతిచెందాడు. ఏన్కూరు మండలంలో మరో వ్యక్తి చేపల కోసం వెళ్లి సాగర్‌ కాల్వలో మునిగి మృతిచెందాడు. ఈ రెండు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.. 

రిజర్వాయర్‌లో పడి మత్స్యకారుడు..

కూసుమంచి: చేపల వలలు వేసేందుకు వెళ్లిన మత్స్య కారుడు ప్రమాద వశాత్తు పాలేరు రిజర్వాయర్‌లో పడి  మరణించిన ఘటన ఆదివారం నాయకన్‌గూడెంలో చోటు చేసుకుంది. చేపల వేట రోజే మత్స్యకారుడు మృతి చెందటంతో నాయకన్‌గూడెంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన  మండల వీరబాబు (32) చెరువులోకి వలలు వేసేందుకు ఆదివారం మధ్యాహ్నం వెళ్లాడు.  రిజర్వాయర్‌లో వలలు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో గల్లంతయ్యాడు. సుమారు 3 గంటల పాటు మత్స్య కారులు వెతకటంతో ఆచూకీ అభించింది. అలలకు తెప్ప తిరగల పడి మరణించాడా?లేక ఫిట్స్‌, గుండెపోటుతో మృతిచెందాడా అనేది తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య నాయకన్‌గూడెం గ్రామదీపికగా పనిచేస్తుంది. ఈ ఏడాది అధికారికంగా సోమవారం నుంచే చేపల వేట జరగాల్సి ఉంది. కానీ ముందుగానే ఆదివారం రిజర్వాయర్‌లో కొత్తూరు, ఎర్రగడ్డ వైపున చేపల వేటకు దిగినట్లు తెలిసింది.

మొసళ్ల భయంతో మత్స్యకారులు...

     పాలేరు రిజర్వాయర్‌లో మొసళ్ల భయం ఎక్కువగా ఉంది. సంవత్సరం కాలంగా పదుల సంఖ్యలో మొసళ్లు రిజర్వాయర్‌లో మత్స్యకారుల కంట పడటం.. వాటిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించటం వంటివి చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లా సరిహద్దులో రిజర్వాయర్‌ పక్కనే గల చేపల చెరువులో పెద్ద మొసలి కనిపించటంలో సూర్యాపేట అటవీ అధికారులకు తెలియజేశారు. వారు పట్టుకొని తిరిగి పాలేరులోనే దానిని వదిలివేశారు. చేపల వేట సమ భయంతో వేట ప్రారంభిస్తున్నామని మత్స్యకారులు 

తెలిపారు. 

వరుస  ఘటనలు .. 

  సంవత్సర కాలంగా ముగ్గురు మత్స్య కారులు రిజర్వాయర్‌లో పడి గల్లంతయ్యారు. అందురూ నాయకన్‌గూడెం వాసులే కావటంతో ఆందోళన చెందుతున్నారు. 1,600 మంది సభ్యులు ఉన్న పాలేరు రిజర్వాయర్‌ పరిధిలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చెందిన 18 గ్రామాలమత్స్యకారులు చేపల వేటతో జీవనం సాగిస్తుంటారు. కానీ  ఎప్పుడూ నాయకన్‌గూడెం వాసులకే ప్రమాదాలు జరగటంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ గ్రామానికి చెందిన బయ్య లింగయ్య, నిమ్మర బోయిన లింగయ్య, రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లి  మరణించారు. తాజాగా ఆదివారం మండల వీరబాబు మృతిచెందాడు.

తిమ్మారావుపేటలో..

ఏన్కూరు: మండలంలోని  తిమ్మారావుపేటకు చెందిన దరావత్‌ లఘుపతి(60) చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్‌ కాల్వలో చేపలు పట్టడానికి ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. మోకాలి లోతు నీళ్లలో  చేపలు పడుతుండగా ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో నీళ్లలో మునిగి మృతిచెందాడు. కుమారుడు నాగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. logo