శనివారం 04 జూలై 2020
Khammam - Jun 07, 2020 , 00:28:28

ఇంటింటి సర్వేతో వ్యాధుల గుర్తింపు

 ఇంటింటి సర్వేతో  వ్యాధుల గుర్తింపు

  • భద్రాద్రిలో 63,937, ఖమ్మంలో 99,308 మంది బాధితులు
  • బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే మందులు
  • వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం

అందరికీ ఆరోగ్యం.. అదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం.. రాష్ట్రంలో ఎవరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడొద్దనే ధ్యేయంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.. ప్రభుత్వ వైద్యశాలలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను ఆధునీకరించి ప్రైవేట్‌కు దీటుగా వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా   కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు, అవసరమైన వారికి  శస్త్రచికిత్సలు చేయించారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.. ఆరోగ్య  తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ప్రప్రథమంగా రోగుల ఇంటి వద్దకే వెళ్లి దీర్ఘకాలిక బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. ఉమ్మడి జిల్లా సర్వేలో గుర్తించిన బాధితులకు ప్రతినెలా వారి ఇండ్లకే వెళ్లి మందులు అందజేస్తున్నారు.. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో లబ్ధిపొందిన బాధితులు సీఎం సారు సల్లంగ  ఉండాలే అంటూ దీవిస్తున్నారు..     

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/మయూరిసెంటర్‌: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సర్కార్‌ అడుగులు వేస్తున్నది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే జ నం భయపడేవారు. ఇప్పుడు అన్నింటికీ సర్కారు దవాఖానలే పెద్దదిక్క యినాయి. సీఎం కేసీఆర్‌ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి    అనేక సౌకర్యాలు కల్పించడంతో ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడు తు న్నారు. సర్కార్‌ ఆస్పత్రులు కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నాయి . కరోనాకు చికిత్స అందించడంలో ప్రభుత్వ వైద్యుల కృషి అంతాఇంతా కాదు. ప్రభుత్వం కంటివెలుగు ద్వారా పత్రి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు అందించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీ లను, సబ్‌ సెంటర్లను ఆధునీకరించి అందరికీ వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. డయాలసిస్‌ రోగులు ఇబ్బందులు పడకుండాఏజెన్సీ ప్రాంతాల్లో కూడా డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశంలోనే ప్రప్రథమంగా రోగుల ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించడంతో పాటు ఔషధాలను కూడా పంపిణీ చేస్తుంది. 

వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఇంటింటి సర్వే..

     వ్యాధుల నియంత్రణలో భాగంగా వాటిని అదుపు చేసేందుకు వై ద్యారోగ్యశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. పీహెచ్‌సీల పరిధిలోని ఏఎ న్‌ఎంలు, ఆశలు ఇంటింటికీ వెళ్లి ర్యాండమ్‌ సర్వే చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నుంచి గ్రామస్థాయిలో సర్వేలు చేపట్టి జ్వర పీడితులు,  మధుమేహం, రక్తపో టుతో బాధ పడేవారిని కూడా గుర్తించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా  సుమా రు 5,81,333 మందికి రక్తపోటు, 156525 మందికి మధుమేహం ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రక్తపోటు వ్యాధిగ్రస్తులు 41,573 మంది, మధుమేహ రోగులు 22,364 మంది ఉన్నారు.  ప్రతి రోగికి సం బంధించిన పూర్తి వివరాలు, చికిత్స విధా నాన్ని ఒక యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని వల్ల సులభంగా చికిత్సను అందించడం సాధ్యమవుతున్నది. 

ఇంటికే మందులు.. 

షుగర్‌,బీపీ ఉన్న వారికి ఇంటికే మందులు సరఫరా చేస్తున్నది. ఆరోగ్య సేవలను వికేంద్రీకరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ వైద్యం అందించాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా సమయంలో ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం వారికి నేరుగా ఇంటికే ఔషధాలను సరఫరా చేస్తున్నది. 

కరోనా నియంత్రణకు ప్రభుత్వ కార్యాచరణ

     కరోనా... ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. దీని నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న హైపర్‌ టెన్షన్‌ (బీపీ), మధుమేహం (షుగర్‌) వ్యాధిగ్రస్తులకు కరోనా వైరస్‌ సోకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సేవలను విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రతీ ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి షుగర్‌, బీపీ ఉన్న వారిని గుర్తించి ఔషధాలు పంపిణీ చేస్తున్నది. 

ఆరోగ్య ఖమ్మం దిశగా కృషి..

అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి 30 సంవత్సరాలు పై బడిన  వారి ఆ రోగ్య వివరాలను ఆరోగ్య కార్డులో పొందుపరుస్తున్నారు. అన్ని పీహె చ్‌సీల్లో మందులను అందుబాటులో ఉంచాం. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశాలతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్య ఖమ్మం జిల్లా దిశగా కృషి చేస్తున్నాం. 

-డాక్టర్‌ బి. మాలతి, ఖమ్మం డీఎంహెచ్‌వో logo