గురువారం 16 జూలై 2020
Khammam - Jun 07, 2020 , 00:05:53

వ్యభిచార ముఠా అరెస్టు

వ్యభిచార ముఠా అరెస్టు

ఖమ్మం సిటీ : కొంతకాలంగా యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడిచేసి ఓ ముఠాను అరెస్టు చేసిన సంఘటన నగరంలో శనివారం చోటుచేసుకుంది. ఖమ్మం టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మామిళ్లగూడెం మొండిగేటు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా శనివారం పట్టుపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం 4 గంటలకు ఒక ఇంటిపై పోలీసులు దాడిచేయగా ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1800 నగదు, మూడు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్‌ ఏఎస్‌ఐ కె.సుబ్బారావు, కానిస్టేబుళ్లు కే.శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాస్‌, మహిళా పోలీస్‌ లక్ష్మి పాల్గొన్నారు. ఎస్‌ఐ రమేశ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సీఐ తుమ్మ గోపి కేసు నమోదు చేశారు. logo