మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 06, 2020 , 01:23:10

‘108’లో డ్రైవర్‌, ఈఎంటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

‘108’లో డ్రైవర్‌, ఈఎంటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మయూరిసెంటర్‌: జీవీకే ఈఎంఆర్‌ఐలో డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 విభాగ ప్రోగ్రాం మేనేజర్‌ విజయేందర్‌ శుక్రవారం తెలిపారు. జీవీకే ఈఎంఆర్‌ఐలో 108 అంబులెన్స్‌, 102 అమ్మ ఒడి, 1962 పశువు ఆరోగ్యసేవా వాహనాలు, పార్థివదేహాల తరలింపు వాహనాల్లో పనిచేసేందుకు డ్రైవర్‌, ఈఎంటీ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డ్రైవర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్‌, ఫెయిల్‌, లైట్‌ మోటర్‌, హెవీ మోటర్‌ వెహికిల్స్‌ లైసెన్సులు, ట్రాన్స్‌పోర్ట్‌ లైసెన్స్‌, బ్యాడ్జీ, మూడేళ్ల అనుభవం, 22-30 ఏళ్ల వయసు వంటి అర్హతలు ఉండాలని వివరించారు. ఈఎంటీ పోస్టులకు బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌, జీఎన్‌ఎం, బీఎస్సీ, ఎమ్మెల్టీ విద్యార్హతలతోపాటు 30 ఏళ్ల వయస్సు ఉండాలని అన్నారు. ఈ నెల 6న ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరిగే ఇంటర్వ్యూకు అభ్యర్థులు రావాలని సూచించారు. మాస్కులు ధరించడం, కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని అన్నారు. వివరాలకు 7330946051, 9154248534 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.


logo