ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 06, 2020 , 01:21:10

జల కాలుష్యానికి చెక్‌

జల కాలుష్యానికి  చెక్‌

పాల్వంచ:కేటీపీఎస్‌ కర్మాగారం నుంచి బయటకు వచ్చే కలుషిత నీటితో నదులు కాలుష్యం కాకుండా టీఎస్‌ జెన్‌కో చర్యలు చేపట్టింది.  కేటీపీ ఎస్‌ 5,6 దశల వద్ద రూ.11కోట్ల వ్యయంతో నీటి శుద్ధి క ర్మాగారాన్ని నిర్మించింది. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే బయటకు వదలనున్నారు. కేటీపీఎస్‌లో వాడిన నీళ్లు కాలువల ద్వారా కిన్నెరసానిలో కలుస్తాయి. దీంతో పారే నీరు కాలుష్యం అవుతున్నది. కేంద్ర జలవనరుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి టీఎస్‌ జెన్‌కో యా జమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కేటీపీఎస్‌ నుంచి బయటకు పంపే  కలుషిత నీటిని పారే నదు లు, జలాశయాల్లోకి విడుదల చేయవద్దని  సూచిం చింది. ఈ క్రమంలో జెన్‌కో  అధికారులు కేటీపీఎస్‌ 5,6 కర్మాగారం స్విచ్‌యార్డు పక్క నీటి శుద్ధి  కేంద్రాన్ని  ఏర్పాటు చేశారు. కర్మాగారంలో వాడిన నీటిని శుద్ధి చేయనున్నారు.మళ్లీ ఆ నీటిని కేటీపీఎస్‌లోనే కర్మాగారం అవసరాలకు  మొక్కలకు వాడుకోనున్నారు. నీటిశుద్ధి కేంద్రం వారం రోజుల్లో పూర్తి కానుంది. 

        logo