బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 05, 2020 , 02:19:00

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

  • మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే సండ్ర వినతి

సత్తుపల్లి రూరల్‌ : సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలని  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. పట్టణంలోని రాజీవ్‌కాలనీలో రూ.3కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా టెండర్లు నిలిచిపోయాయన్నారు. త్వరితగతిన స్పందించి పట్టణాభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి నిధులు మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఉన్నారు.


logo