గురువారం 02 జూలై 2020
Khammam - Jun 05, 2020 , 02:16:58

జిల్లాలో ఆధునిక సాగు..

జిల్లాలో ఆధునిక సాగు..

  • ప్రతి పనికీ ప్రత్యేక యంత్రాలు
  • కూలీల కొరత సమస్యకు పరిష్కారం
  • కాలం, ఖర్చు.. రెండూ ఆదా..
  • టీ సర్కార్‌ ముందు చూపునకు నిదర్శనం

ట్రాక్టర్లు, రొటోవేటర్లు, వరినాటు యంత్రాలు, కలుపు తీత యంత్రాలు, స్ప్రేయర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లు, పవర్‌ టిల్లర్లు... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో వీటిల్లో కొన్నయినా తప్పక కనిపిస్తాయి. సాగు యాంత్రీకరణలో మన రైతులు ముందున్నారని, ఆధునికతను అందిపుచ్చుకుంటున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఉమ్మడి జిల్లాలో సాగు యాంత్రీకరణపై మరికొన్ని వివరాలు..

ఖమ్మం వ్యవసాయం: నాట్లు వేయాలన్నా, విత్తనాలు నాటాలన్నా, కలుపు తీయాలన్నా, పంట కోయాలన్నా.. ఇలా ప్రతి పనికీ కూలీలు కావాలి. తగినంతమంది కూలీలు దొరక్కపోవడంతో పనులు ఆలస్యమయ్యేవి. కూలీల ఖర్చు కూడా అధికమయ్యేది. పంట పెట్టుబడులన్నీ ఒక ఎత్తయితే.. ఈ కూలీల ఖర్చు మరొక ఎత్తయ్యేది. చివరికి చూసుకుంటే రైతుకు ఏమీ మిగిలేది కాదు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలోని రైతాంగ దుస్థితి. తెలంగాణ ఆవిర్భావంతో క్రమ క్రమంగా ఈ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. సాగు ఖర్చులు తగ్గాలన్నా, కూలీల కొరత తీరాలన్నా, పంట ఉత్పత్తులు త్వరగా చేతికి అందాలన్నా..వ్యవసాయ యాంత్రీకరణే మార్గమని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకమంది రైతులకు భారీ రాయితీలపై ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలను అందించింది. దీంతో వానకాలం, యాసంగి సీజన్‌లో సాగు పనులు సకాలంలో జరుగుతున్నాయి. సాగు యాంత్రీకరణలో తెలంగాణలోనే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందున్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ట్రాక్టర్‌ అందుబాటులో ఉంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు కూడా చెప్పుకోదగ్గ సం ఖ్యలోనే ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా సాగు సంబంధ యంత్రాలు కనపడుతున్నాయి. రాను న్న రోజుల్లో పూర్తి స్థాయిలో సాగు యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

కరోనా కష్టకాలంలో కూడా..

కరోనా మహమ్మారి ప్రభావం సాగుపై పడకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చ ర్యలు తీసుకున్నది. యాసంగి పంట చేతికొచ్చే దశలోనే కరోనా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎవ్వరూ బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.

ఏకంగా కొనుగోలు కేంద్రాలనే రైతుల ముంగిటకు తీసుకెళ్లింది. వారి పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసింది. మున్ముందు కరోనా ప్రభావం మరింత ఎక్కువైనట్లయితే వ్యవసాయ కూలీలు కూడా పనులకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని అంచ నా వేసి తదనుగుణ చర్య లు కూడా తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యంత్ర పరికరాల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏయే యంత్ర పరికరాలు అవసరమవుతాయో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో.. మన జిల్లా లో యాంత్రీకరణ ఎవుసం సాగుతున్నది. కాలం, ఖర్చు.. అన్నీ ఆదా అవుతున్నాయి. రా ష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అమలు ద్వా రా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పునకు టీ సర్కార్‌ శ్రీకారం చుట్టింది.logo