సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 04, 2020 , 03:17:32

వైభవంగా రామయ్య కల్యాణం

వైభవంగా  రామయ్య కల్యాణం

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అంతరాలయంలోని మూలమూర్తులకు సమీపంలో సాంప్రదాయబద్ధంగా నిత్య కల్యాణం జరిగింది. కల్యాణ క్రతువులో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం నిర్వహించారు. నేడు రామాలయంలో జ్యేష్ఠాభిషేకం అంకురార్పణ నిర్వహించనుండటంతో నిత్య కల్యాణం నిలిపివేయనున్నారు. 


logo