గురువారం 02 జూలై 2020
Khammam - Jun 04, 2020 , 03:15:04

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

  • ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో సీజనల్‌ వ్యాధుల నివారణ 
  • ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రతి నెలా రూ.30కోట్లు
  • ఊరూరా వైకుంఠధామం,  డంపింగ్‌యార్డు, నర్సరీ నిర్మించాం
  • ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేశాం 
  • ‘నమస్తే తెలంగాణ’ తో  మంత్రి పువ్వాడ అజయ్‌

రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం.. ఉమ్మడి  పాలనలో అభివృద్ధి ఊసే లేని తెలంగాణను స్వరాష్ట్రంలో      ఎన్నో పథకాలు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ     అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు.. గ్రామీణ   వ్యవస్థను పటిష్టం చేసే లక్ష్యంతో నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారుస్తున్నారు.. వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు  కల్పించారు.. పారిశుధ్యంలో ప్రజలను భాగస్వాములను  చేస్తూ అధికారుల్లో జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో  మరోమారు 8 రోజుల పారిశుధ్య కార్యక్రమానికి శ్రీకారం     చుట్టారు. రాష్ర్టాభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.     

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పను లు చేపట్టారు. కేసీఆర్‌ అంటే.. కాలువలు,చెక్‌డ్యాం లు, రిజర్వా యర్లు అన్నట్లుగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. రైతన్న ఇంట సిరుల పంట పండుతోంది.  పేదలకోసం సంక్షేమ పథకాలు  అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

పల్లెలు..దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని నిజం చేస్తూ  గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసే లక్ష్యంతో రూ పొందించిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పల్లె సీమలు, పట్టణాల రూపురేఖలు మార్చే దిశగా కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తు న్నా రు. గత ఏడాది నెల రోజుల పల్లె ప్రగతికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పల్లెలు మల్లెలుగా మెరిసేలా చేశారు.

ఈ ఏడాది జనవరిలో 10 రోజుల పాటు రెండో విడుత పల్లె ప్రగతిని కొనసాగించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా ఈ నెల 1 నుంచి 8 తేదీ వరకు పల్లెలు,పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖ మ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశుధ్య పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య పనులను రఘునాథపాలెం మండలంలో ప్రారంభించారు. ఉమ్మడి జి ల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్‌ లక్ష్య మంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖి. 

నమస్తే :గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు  ఏ విధంగా ఉంది..? 

మంత్రి పువ్వాడ :గత ప్రభుత్వాల హయాంలో నిధులు లేక పంచా య తీలు అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్‌ పల్లె సీమలపై ప్రత్యేక దృష్టిసారించారు. పల్లెలు మల్లెలు గా మెరవాలని నిధులు కేటాయి స్తున్నారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. ఏ గ్రామాన్ని చూసినా పరిశుభ్రత,పచ్చదనంతో పరిఢవిల్లుతుంది .నిధుల కొరతలేదు.. గ్రామ పంచాయతీలకు విరివిగా కేటాయిస్తున్నాం. గ్రామ జనాభాను బట్టి కేటాయింపులు ఉంటున్నాయి. ప్రతి వ్యక్తికి నెలకు సుమారు రూ.160 నుంచి రూ.168 వరకు విడుదల చేస్తున్నాం. రాష్ట్ర ఫైనాన్స్‌ నిధులు, 14వ ఆర్థిక సం  ఘం నిధులతో కలిపి ఖమ్మం జిల్లాకు ప్రతి నెలా రూ.16.50 కోట్లు వస్తున్నాయి.పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్న విధంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా  రూ. 14 కో  ట్లు వస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళిక  రూ పొందించారు. 

నమస్తే : గతంలో నిర్వహించిన పల్లెప్రగతిలో సాధించిన పురోగతి గురించి..

మంత్రి పువ్వాడ :  ఉమ్మడి జిల్లాలో గతేడాది పల్లెప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వ హించుకొని గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. గ్రామాల్లో ఉన్న సమస్య లకు శాశ్వత పరిష్కారం దొరికింది. శిథిలా వస్థ లోఉన్న భవనాలను నేలమట్టం చేశాం.. ఆ తర్వాత నిర్వహించిన పట్టణ ప్రగతి కూడా విజయవంతమైంది. ముఖ్యంగా ప్రతి గ్రా మంలో శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించాం. గ్రా మపంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి అందించాం. పంచాయతీలో ఒక నర్స రీని ఏర్పాటు చేశాం. వీటి ద్వారా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

నమస్తే: ఎన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించారు..?

మంత్రి పువ్వాడ :ఖమ్మం జిల్లాలో 584 ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481   గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి చేశాం. తడి, పొడి చెత్తను వేరుచేయడానికి ప్రత్యేక షెడ్‌లను నిర్మించాం. గ్రామ పంచాయతీ నిధుల నుంచి 10 శాతం నిధులను నర్సరీల నిర్వహణకు ఖర్చు చేస్తున్నాం. పంచాయతీ సిబ్బందిలో పార దర్శకతను పెంచాం.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూని యర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేశాం.

నమస్తే : ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉంది..?

మంత్రి పువ్వాడ : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1వ తేదీన సర్పంచ్‌లు, వార్డు సభ్యు లు, అధికారులతో కలిసి అన్ని గ్రామాల్లో పాద యాత్రలు నిర్వహించి సమస్యలు గుర్తించారు. ఎనిమిది రోజుల పాటు నిర్వ హించాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు.  పట్టణా లు, గ్రామాల్లో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు  గుర్తించి వాటిని తొలగించాలని ఆదేశించాం. దోమల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశాం. ముఖ్యంగా దళిత వాడలపై దృష్టి సారించాలని చెప్పాం. 

నమస్తే :కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏంటి..? 

మంత్రి పువ్వాడ :కరోనా నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లౌక్‌ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశాం. అన్ని శాఖల అధికారుల సమ న్వయం తో వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగాం.  ప్రతి ఒక్కరూ మా స్కు ధరించాలని సూచిస్తున్నాం.బయటికి వచ్చినప్పుడు శానిటైజర్‌ కచ్చితంగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాం. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని హెచ్చరిస్తున్నాం. వీటితో పాటు ప్రతి గ్రామంలో రసాయన ద్రావణాలు పిచికారీ చే యాలని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని ఆదేశించాం.రెడ్‌జోన్‌ ఏరియాల్లో పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఆయా  కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరికి వారు కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి.  

నమస్తే :  పారిశుధ్య పనుల్లో  ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది..? 

మంత్రి పువ్వాడ : ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమమైనా ప్రజల చేస్తున్నాం. తొలిరోజు గ్రామంలోని ముఖ్యులు పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుం టున్నాం. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌వా డీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించాం.ఎంపీడీ వోలు, ఎంపీవోలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 

నమస్తే : వానకాలం సీజన్‌లో ప్రబలే  వ్యాధుల నివారణకు  చేపట్టిన చర్యల గురించి..

మంత్రి పువ్వాడ : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పారి శుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను శుభ్రంగా ఉంచు కోవడం, నీటి నిల్వలు లేకుండా చూడడం, పరిశుభ్రమైన మంచి నీటిని తాగడం వలన రోగాలు రావు. అందుకనే ప్రభుత్వం  8 రోజు ల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరుచేసే విధంగా ప్రజలను చైతన్య పరుస్తున్నాం.రోడ్లపై చెత్త వేస్తే రూ.500 జరిమాన కూడా విధిస్తున్నాం. వైద్యారోగ్యశాఖ అధికారు లను అప్రమ త్తం చేశాం. ఏజెన్సీ ప్రాంతాల్లో అవరమయ్యే మందులు సిద్ధంగా ఉంచాం. సిబ్బందిని ముందుగానే నియ మిం చాం. ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖాధికారులతో సమీక్షలు నిర్వ హిస్తున్నాం.సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసు కుంటున్నాం.ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం..

నమస్తే  : ప్రత్యేక పారిశుధ్య  కార్యక్రమాల లక్ష్యం..

మంత్రి పువ్వాడ : వానకాలంలో సీజనల్‌ వ్యా ధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వరద నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి డెంగీ, మలేరియా వచ్చే సమయమిది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు     1 నుంచి 8 తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడు తున్నాం. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, ప్రజాప్ర తిని ధులు, అధికారులను భాగస్వాములను చేసి గ్రామాలను పరిశు భ్రంగా చేయడం లక్ష్యం. ఖమ్మం జిల్లాలోని 584 గ్రామ పంచా యతీ ల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామపం చాయ తీల్లో ఈ కార్యక్రమాలు కొనసా గుతున్నాయి. మంత్రి కేటీ ఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటల పది నిమి షాల పాటు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో పారి శుధ్య పనులు చేపడుతున్నారు. దీంతో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. logo