ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 03, 2020 , 04:01:41

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

రైతును రాజు చేయాలన్నదే..

సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

తెలంగాణ వ్యవసాయ విధానంలో విప్లవాత్మక మార్పులు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 

రఘునాథపాలెం: రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ వ్యవసాయ విధానంలో విప్లవాత్మక మార్పు లు వస్తున్నాయని స్పష్టం చేశారు. రైతులందరినీ ఒక వేదికపైకి తెచ్చి వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అ న్నారు. ఇందులో భాగంగా కూసుమంచి, రఘునాథపాలెం, వీ వెంకటాయపాలెం క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి అజయ్‌కుమార్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో ఆయన ప్రసంగించారు. రఘునాథపాలెంలో సొంత ఖర్చుతో రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తున్నానని, ఈ వేదిక జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఈ వేదికల నిర్మాణానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నా రు. జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లలో ఈ వేదికను నిర్మించనున్నట్లు చెప్పారు.

ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.20 లక్షలను ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ వేదికలో సమావేశ మందిరం, ఏఈవో కార్యాలయం, విత్తనాలు, ఎరువులు నిల్వ చేసేందుకు గదులు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో రఘునాథపాలెం అగ్రికల్చర్‌ హబ్‌గా తయారుకావాలన్నారు. ఇక్కడే వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ కూడా నిర్మాణం కానుందన్నారు. అవకాశం ఉంటే సాయి ల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను మండలానికి తెస్తానన్నారు. చెంతనే ఉన్న సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయాన్ని కూడా సొంత ఖర్చులతోనే నిర్మిస్తానని మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అనంతరం వానకాలం పంటల క్యాలెండర్‌ ఆవిష్కరించారు.     

దేశంలో ఎక్కడా రైతు వేదికలు లేవు: కలెక్టర్‌ 

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతు వేదికలు లే వని, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ వీటిని నిర్మిస్తున్నారని కలెక్టర్‌ కర్ణన్‌ గుర్తుచేశారు. నియంత్రిత పంటల సాగు విధానానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు.

కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్లు ఆదర్శ్‌ సురభి, వరుణ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, డీఏవో ఝాన్సీలక్ష్మీ కుమారి, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ దొంతు సత్యనారాయణ, సర్పంచ్‌ గుడిపుడి శారద, ఉప సర్పంచ్‌ కుందేసాహెబ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, వీవీపాలెం సర్పంచ్‌ రావెళ్ల మాధవి  పాల్గొన్నారు.
logo