ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 01, 2020 , 02:43:59

ఒక్కరోజే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌

ఒక్కరోజే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌

నేలకొండపల్లి మండలంలో 8 మంది, మధిరలో ఒకరు..

కంటైన్మెంట్‌ జోన్‌గా నేలకొండపల్లి

కాంటాక్ట్‌ వ్యక్తుల వివరాల సేకరణలో అధికారులు

రూరల్‌ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మహమ్మారి

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : వైద్యాధికారులు

ఖమ్మం మయూరిసెంటర్‌/నేలకొండపల్లి/మధిర : ప్రశాంతంగా ఉన్న జిల్లాను కరోనా వైరస్‌ గడగడలాడిస్తున్నది. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆదివారం ఒక్కరోజే 9 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. నేలకొండపల్లి మండలంలో 8 మందికి, మధిరలో ఒకరికి   కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 15కి చేరింది. నేలకొండపల్లి పట్టణంలో హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారికి కరోనా సోకడంతో అతని ప్రైమరీ కాంటాక్టు ఆధారంగా కుటుంబ సభ్యులు, దుకాణంలో పనిచేసే గుమస్తాలతో కలిపి 18 మందిని పరీక్షల నిమిత్తం తరలించారు. వారిలో ఆదివారం సాయంత్రానికి 8 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదిలా ఉండగా మధిరలో ఓ వ్యాపారికి కరోనా సోకగా ఈ నెల 29న ఆయన మృతిచెందారు. ఆయన ద్వారా తన కుమారుడు కరోనాకు గురయ్యాడు. తాజాగా మృతిడి భార్యకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఒక్కరోజే 9 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  నేలకొండపల్లి పట్టణాన్ని పూర్తిగా కంటెన్మైంట్‌ జోన్‌గా ప్రకటించారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను కూడా దారి మళ్లించే చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఏర్పాటు చేసి ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నారు. కరోనా ఈ సోకిన 9 మందిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. పాజిటివ్‌ కేసులు నమోదైనప్పటికీ ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.  ప్రతి ఒక్కరు తమ ఇండ్లలోనే ఉండి హోమ్‌ క్వారంటైన్‌ను తప్పనిసరిగా పాటించాలి.  అధికార యంత్రాంగం సూచించే వరకు ప్రజలెవ్వరు బయటకు రాకూడదని అధికారులు పేర్కొంటున్నారు.  

రూరల్‌ప్రాంతాలకు విస్తరిస్తున్న మహమ్మారి

 నిన్నా మొన్నటి వరకు నిశబ్ధంగా ఉన్న నేలకొండపల్లి మండలంలో రెండు రోజుల నుంచి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు ఆంధ్రా సరిహద్దు, మరోవైపు సూర్యాపేట సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్న ఈ మండలంపై సంబంధిత అధికారులు గత కొద్ది రోజుల నుంచి నిఘా ముమ్మరం చేశారు. ఏకంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,  కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సైతం సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను పరిశీలించి స్థానిక అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఈ మండల కేంద్రంలో ఇనుము వ్యాపారం చేసే ఓ వ్యాపారస్తుడు తరచూ సూర్యాపేట, తదితర ప్రాంతాలకు వెళ్లి రావడంతో మూడు రోజుల క్రితం సదరు వ్యాపారస్తుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నేలకొండపల్లి మండల కేంద్రం వాసులతో సహా, మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. లాక్‌డౌన్‌ సడలింపునకు ముందు ఖమ్మం నగరానికే పాజిటివ్‌ కేసుల సంఖ్య పరిమితం కావడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత వాసులు కొంత ఉపశమనం పొందారు. అయితే వలసదారులు తిరిగి గ్రామాలకు రావడంతో మధిర, నేలకొండపల్లి మండల కేంద్రాలతో పాటు పెనుబల్లి మండలాలకు సైతం పాకింది. దీంతో మలివిడతకు సంబంధించి జిల్లాలో ఏడు కేసులు నమోదయింది. ఇదిలాఉండగా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పాజిట్‌వ్‌ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మరో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ  అవడంతో జిల్లా ప్రజలు మరోమారు బయాందోళనలకు గురయ్యారు. నేలకొండపల్లి మండలంతో పాటు సంబంధిత వ్యక్తులతో కలివిడిగా తిరిగిన వారిలో కలవరం మొదలైంది. అయితే పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టు ఆధారంగా ఇతర వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు, జిల్లావైద్యారోగ్యశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మండల కేంద్రంలో 9 కేసులు నమోదుకావడంతో ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌జోన్‌గా ప్రకటించారు.  

కంటైన్మెంట్‌ జోన్‌గా నేలకొండపల్లి

 నేలకొండపల్లిలో  కరోనా వైరస్‌ 8 మందికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్న యజమానికి కరోనా వైరస్‌ రావడంతో అతని కుటుంబ సభ్యులు, దుకాణంలో పనిచేసే గుమస్తాలు, అతనికి దగ్గరగా కాంటాక్ట్‌లో ఉన్న వారితో కలిపి 16 మందిని పరీక్షల నిమిత్తం తరలించారు. వారిలో ఆదివారం సాయంత్రానికి 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్‌ వీరభద్రం, ఎస్సై అశోక్‌రెడ్డి, ఏఎస్సై రాఘవరావు, ఆర్‌ఐ రమేశ్‌ పట్టణంలో తీసుకోవాల్సిన చర్యలను  logo