ఆదివారం 05 జూలై 2020
Khammam - May 31, 2020 , 04:06:03

ఏజెన్సీలో భారీ వర్షం

ఏజెన్సీలో భారీ వర్షం

కొత్తగూడెం/ఇల్లెందు రూరల్‌:ఇల్లెందు ఏజెన్సీలో శనివారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో వచ్చిన వాన ప్రజలను  ఆగమాగం చేసింది. మస్సివాగు గ్రామపంచాయతీ ధర్మారంతండాలో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించింది. శాంతినగర్‌ గ్రామానికి వెళ్లే రహదారిపై చప్టా పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో మండలంలోని కొమరారం, మాణిక్యారం గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. ధర్మారంతండాలో నూతనంగా నిర్మించిన ప్రధాన రహదారి వరద ఉధృతికి ధ్వంసమైంది. దీంతో ధర్మారంతండా, శాంతినగర్‌తండా గ్రామాలకు రాకపోకలు పూర్తి గా నిలిచిపోయాయి.ఆశించిన మేర   వాన పడటంతో రైతులు వానకాలం సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా వర్షం పడింది. శనివారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వాన  కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సుజాతనగర్‌, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలు కూడా విరిగిపడ్డాయి. వాతావరణం చల్లబడటంతో ప్రజల కాస్త ఉపశమనం పొందారు.


logo