శనివారం 11 జూలై 2020
Khammam - May 30, 2020 , 02:26:28

వైరా రిజర్వాయర్‌లో కోలాహలంగా చేపల వేట

వైరా రిజర్వాయర్‌లో కోలాహలంగా చేపల వేట

  • జల పుష్పాల వేట షురూ.. 
  • తొలిరోజు మత్య్సకారులకు నిరాశ.. 
  • వలలకు చిక్కిన మీనాలు 90 టన్నులే..
  • 12 లారీల చేపలు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి

వైరా : వైరా రిజర్వాయర్‌లో చేపల వేట శుక్రవారం కోలాహలంగా ప్రారంభమైంది.   మొదటి రోజు మత్స్యకారులకు నిరాశే మిగిలింది. రిజర్వాయర్‌ నీటిమట్టం అధికంగా ఉండడంతో ఆశించిన స్థాయిలో చేపలు లభ్యం కాలేదు. గతేడాది 10 అడుగుల నీటి మట్టం ఉండడంతో మొదటిరోజే 150 టన్నుల చేపలు దొరికాయి. ఈసారి నీటిమట్టం 19.07 అడుగులు ఉండడంతో 90 టన్నుల చేపలే మత్స్యకారుల వలకు చిక్కాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత రిజర్వాయర్‌లో చేపలు పట్టడంతో ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని గంపలగూడెం, వత్సవాయి ప్రాంతాల ప్రజలు భారీగా వైరా రిజర్వాయర్‌కు తరలివచ్చారు. దీంతో రిజర్వాయర్‌ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆశించిన స్థాయిలో లభించకపోవడంతో కొనుగోలు చేసేందుకు వచ్చిన జనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రిజర్వాయర్‌ వద్ద పడిగాపులు కాసి వెనుదిరిగారు. మత్స్యకారులు కిలో చేపను హోల్‌సేల్‌లో రూ.70కు, రిటైల్‌లో రూ.100లకు విక్రయించారు. రొయ్యలు కిలో  రూ.200లకు విక్రయించారు.    1200 మంది మత్స్యకారులు చేపల వేటలో పాల్గొన్నారు.   మత్స్యకారులు పట్టుకున్న చేపలను ఇతర రాష్ర్టాలకు 12 లారీల్లో ఎగుమతి చేశారు. 


logo