మంగళవారం 14 జూలై 2020
Khammam - May 28, 2020 , 01:11:53

ఆందోళన వద్దు ..అప్రమత్తంగా ఉండండి

ఆందోళన వద్దు ..అప్రమత్తంగా ఉండండి

  • మాస్క్‌ (కేఐవోఎస్‌కే) కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ 

ఖమ్మం/మయూరి సెంటర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. అత్యవసరంగా బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని మంత్రి అన్నారు.  మాస్క్‌లు అందరికి అందుబాటులో ఉండేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌, ఖమ్మం ప్రధాన ఆసుపత్రి, బస్టాండ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మాస్క్‌ (కేఐవోఎస్‌కే) కేంద్రాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు అందుబాటులో ఉంచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సామాన్యుడికి సైతం మాస్క్‌   రూ.10కే అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తరచుగా చేతులను శానిటైజ్‌ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలన్నారు. బస్టాండ్‌ ఆవరణను పరిశీలించి ఆర్టీసీడ్రైవర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌,  కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo