గురువారం 16 జూలై 2020
Khammam - May 27, 2020 , 00:51:00

నియంత్రిత సాగులాభాలు బాగు..

నియంత్రిత సాగులాభాలు బాగు..

 డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి.. 

 సన్నరకం వరి సాగుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రుణమాఫీ అందించకపోవడంపై మంత్రి ఆగ్రహం

రైతు వేదికల నిర్మాణానికి దాతలు విరాళాలు ఇవాలి

వానకాలం-2020 అవగాహన సదస్సులో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

“నియంత్రిత వ్యవసాయమే రైతుకు లాభాలు తెచ్చిపెడుతుంది.. అందరూ ఒక్కటే కాకుండా అన్ని రకాలు సాగు చేస్తే డిమాండ్‌ పెరుగుతుంది,         గిట్టుబాటూ అవుతుంది.. సీఎం కేసీఆర్‌ సంకల్పానికి రైతులంతా సహకరిస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది..” అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో ‘వానకాలం -2020’ సాగు ప్రణాళికపై           అవగాహన కార్యక్రమం జరిగింది. మంత్రి అజయ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియంత్రిత సాగుపై జిల్లా అధికారులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించి, వ్యవసాయ,         అనుబంధ శాఖల వారీగా సమీక్షించారు. రుణమాఫీ విషయమై అధికారుల అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్‌కు అందరూ సహకరించాలన్నారు. 

 భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ :నియంత్రిత వ్యవసాయమే రైతుకు మేలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ‘వానకాలం -2020’ సాగు ప్రణాళికపై జిల్లా అధికారులు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి వ్యవసాయ, అనుబంధ శాఖల వారీగా సమీక్షించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులంతా ఒకేరకం పంటవేసి నష్టపోకుండా డిమాండ్‌ ఉన్న వాటిని పండించాలన్నారు.  ఆ దిశగా అన్నదాతలను చైతన్యపర్చాలని అధికారులకు సూచించారు. నేల స్వభావం, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి పం టలు పండించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. సన్నరకం వరి సాగుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, కంది, పత్తి పంటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. వరి, పత్తి, కంది, మిర్చి పంటలపైనే ఎక్కువ దృష్టి సారించాలని, మొక్కజొన్న సాగును గణనీయంగా తగ్గించాలన్నారు. పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండిం చాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వివరించడానికి, అధికారులు పరస్పరం చర్చించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవా లన్నారు. దాతలు ముందుకొచ్చి రైతు వేదికల నిర్మాణాల్లో తమవంతు పాత్ర పోషించా లన్నారు. దాతలు విరాళం ఇచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలని, మిగతా చోట్ల ప్రభు త్వ స్థలాల్లో వేదికలు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 3,54,337 ఎకరాల్లో సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని, అందుకు సరిప డా విత్తన లభ్యత కోసం అధికారులు ముందే ఏర్పా ట్లు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలో సొంతఖర్చుతో రైతువేదిక నిర్మాణం చేపడుతున్నారని, అదే స్ఫూర్తితో తాను కూడా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం లో సొంతంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తన అమ్మమ్మ ఊరైన దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో  తాతపేరిట రైతువేదిక నిర్మాణాన్ని సొంత ఖర్చులతో చేపడతానని మంత్రి ప్రకటించారు. ఈ అవగాహన కార్యక్రమంలో  జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రా జేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి కొర్సా అభిమన్యుడు, జిల్లా ఉద్యాన అధికారి మరియన్న, ఆర్డీవో స్వర్ణలత, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 

రుణమాఫీ అందించకపోవడంపై మంత్రి ఆగ్రహం...

      సీఎం కేసీఆర్‌ రూ.25 వేల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, జిల్లాలో ఎంత మందికి రుణమాఫీ జరిగిందని అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 10,049 మంది రైతులకు రుణమాఫీ చేశామని, మిగిలిన 18,452 మందికి చేయాల్సి ఉందని అధికారులు తెలపడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.21 కోట్ల 8 లక్షలు రుణమాఫీ కింద బ్యాంకర్లకు ఇప్పటికే ఇచ్చి ఉన్నామని, రుణమాఫీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అధికారులు తెలపడంతో వెంటనే వాటిని పరిష్కరించి మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన రుణమాఫీ చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ప్రతిదానికి లాక్‌డౌన్‌ అని చెప్తే సరిపోదని, జిల్లా ఎప్పుడో గ్రీన్‌ జోన్‌ అయిందని, రైతు మేళాలు నిర్వహించి త్వరితగతిన రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

భూసార పరీక్షల ఆధారంగా పంటలు వేయాలి : ఎంపీ నామా

     జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని నీటి లభ్యత, భూ సార పరీక్షల ఆధారంగా పంటలు వేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నా రు. సీఎం కేసీఆర్‌ నూతన విధానాలు ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశ గా ముందుకు సాగుతున్నారన్నారు. కనీసం ఒక ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధం గా చేయాలని, ఇజ్రాయిల్‌ దేశంలో ఇసుక నేలలో రకరకాల పంటలను పండించి ఆధునిక వ్యవసాయాన్ని చేస్తున్నారన్నారు. కరోనా కట్టడిలో జిల్లా కలెక్టర్‌ సహా అధికార యం త్రాంగం బాగా పనిచేసిందని, అదే దిశలో పయనించి వానకాలం సాగు ప్రణాళికలో కూడా జిల్లాను నంబర్‌వన్‌గా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు.సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానం బాగుంటుందని, రైతుబిడ్డగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆయన నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు. రైతును చైతన్యపర్చి వరిలో విత్తనాలు చల్లే విధానంపై అవగాహన పెంచాలని, దాని ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు.  రాష్ట్రంలోనే ఆయిల్‌ఫాం సాగులో జిల్లా ముం దుంటుందన్నారు. జిల్లాలో సాగు మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

పోడు భూముల సమస్య సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలి..

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

     రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే కొత్తగూడెం లో పోడురైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూముల్లో కందకాలు తవ్వి ఫారెస్టు భూములని రైతులపై కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తుంటే వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయడం వల్ల రైతులకు లాభం చేకూ రుతుందని తెలిపారు. పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని  కోరారు.

అందరూ ఒకే పంటలు వేయకూడదు..: బానోత్‌ హరిప్రియా నాయక్‌, ఇల్లెందు ఎమ్మెల్యే

     రైతులు ఎవరికి నచ్చిన పంటలు వారు వేయడం వల్ల గిట్టుబాటు ధరలు ఉండవని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ అన్నారు. ఒకరు మక్క వేస్తే అందరూ అవే వేస్తున్నారని అందువల్ల నియంత్రిత వ్యవసాయం చేయాలన్నారు. పోడు రైతుల్లో కూడా సాగువిధానంలో మార్పులు తెచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. మక్కలు ఎక్కువ సాగు చేయడం వల్ల భూసారం పూర్తిగా పోతుందని, అందువల్ల ఇతర పంటలకు దిగుబడి రావడం లేదన్నారు. రైతుబంధు సమితుల సమావేశంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పోడు సమస్య చాలా సున్నితమైనది..:  రాములు నాయక్‌,వైరా ఎమ్మెల్యే.

    జిల్లాలో సున్నితమైన పోడుభూముల సమస్య చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ అన్నారు. ఫారెస్టు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే  లాభాల పంట పండుతుందన్నారు.

ప్రభుత్వ నిర్ణయం మంచిది..:  అంకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్‌

   నియంత్రిత వ్యవసాయం పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం చాలా మంచిదని రైతుబంధు సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్‌ అం కిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. రైతు లు కూడా అదేప్రయత్నంలో ఉన్నారన్నారు.వానకాలం పం టలకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేశారని తెలిపారు. విత్తనాలు, ఎరువులు  సిద్ధం చేశామన్నారు.

విక్రయాలకు అనుమతి ఇవ్వండి..: బాలసాని లక్ష్మీనారాయణ,ఎమ్మెల్సీ

 రైతులు పంటలు వేసుకోవాలంటే ముందు విత్తన షాపులకు విక్రయించే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఏ పంటలు వేయకూడదో వా టికి అనుమతి ఇవ్వకూడదన్నారు. రానున్న రోజుల్లో రైతును రాజు చే యాలన్నదే ప్రభుత్వం ఉద్దే శమని ఆ దిశగా సీఎం కేసీఆర్‌ ఆలోచించి నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.


logo