మంగళవారం 14 జూలై 2020
Khammam - May 25, 2020 , 00:16:31

ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి

ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి

పండుగను సంతోషంగా  జరుపుకోవాలి

ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలి

రంజాన్‌ కిట్ల పంపిణీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ఖమ్మం: ముస్లింలు పవిత్ర రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ ఇండ్లలోనే నిర్వహించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశా రు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభు త్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని సూచించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని పు వ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోని 11, 21, 26 డివిజన్లలో మూడు వేల నిరుపేద ముస్లిం కుటుంబాలకు మంత్రి అజయ్‌కుమార్‌ తోఫాలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఆలోచనతో నిత్యావసరాలతో కూడిన కిట్లను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, పగడాల నాగరాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo