శనివారం 30 మే 2020
Khammam - May 23, 2020 , 23:38:08

ఆన్‌లైన్‌ పాఠం.. విద్యార్థి వికాసం

ఆన్‌లైన్‌ పాఠం.. విద్యార్థి వికాసం

టీ-సాట్‌ ద్వారా తరగతుల నిర్వహణ

‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా బోధన

లాక్‌డౌన్‌ సమయంలోనూ పాఠాలు

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: లాక్‌డౌన్‌లో భాగంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థులు పరీక్షల గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ప్రభు త్వం ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. అధికారులు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  నిరంతరం అభ్యసన కోసం ఆన్‌లైన్‌,వాట్సాప్‌,టీ సాట్‌ ద్వారా పాఠాలు చెబుతున్నారు. తరగతులు  నిర్వహిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

టీ-సాట్‌ ద్వారా పాఠాల ప్రసారం...

       ప్రభుత్వం టీ-సాట్‌ ద్వారా ప్రతిరోజూ పదో తరగతి విద్యార్థులకు పాఠాలు ప్రసారం చేస్తున్నది. దీనికి సంబంధించి ప్రసార వివరాలు ప్రతి 15 రో జులకు ఒకసారి డీఈవోలకు సమాచారం ఇస్తు న్నారు. ఈ సమాచారం డీఈవోల ద్వారా హెచ్‌ఎంలకు, వారి నుంచి విద్యార్థులకు చేరవేస్తున్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థులు ఆయా పాఠాలను టీ-సాట్‌ చానల్‌ ద్వారా చూసి నేర్చుకుంటున్నారు. ఈ-లెర్నింగ్‌ యాప్‌లో ఆరు నుంచి పదో తరగతి వి ద్యార్థులకు సంబంధించి 551 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలను పిల్లలు వారికి అనుకూలమైన సమయాల్లో వీక్షించవచ్చు. మొబైల్‌ ఫోన్‌ కా నీ, టీ-సాట్‌ చానల్‌ కానీ అందుబాటులో లేని వారు దూరదర్శన్‌ యాదగిరి చానల్‌లో పాఠాలను వీక్షించవచ్చు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 162 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  చాలా మం ది ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌ల ఏర్పాటు...

     జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులే ప్రతి రోజూ ఒక విషయంపై ప్రశ్నాపత్రం తయారు చేసి గ్రూపులో పెడతారు. పి ల్లలు ఈ ప్ర శ్నాపత్రాన్ని చూసి అందులోని ప్రశ్నలకు జవాబులు రాసి వాటిని తిరిగి గ్రూ ప్‌లో పోస్టు చేస్తారు. గ్రూపులో పెట్టిన జవా బు పత్రాలను ఉపాధ్యాయులు పరిశీలించి విద్యార్థులకు సూచనలు,సలహాలు ఇస్తుంటారు.       జిల్లాలోని 162 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 122 పాఠశాల్లో మాత్రమే ఈ గ్రూ పులు ఏర్పాటు చేశాయి. కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ సిగ్న ల్స్‌ లేకపోవడం చాలా మంది పిల్లలకు మొబైల్‌ ఫోన్లు అందుబాటులో లేకపోవడంలాంటి కొన్ని కారణాల వల్ల అన్ని పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని చేపట్టలేక పోయాయి. గ్రూపులు ఏర్పాటైన పాఠశాలల విద్యార్థులు మాత్రం చాలా ఆసక్తికరంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

 ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం..

  పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వాట్సాప్‌ గ్రూపులు, ఆన్‌లైన్‌ తర గతుల ద్వారా విద్యార్థులకు మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టు

లపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రశ్నాపత్రాలను తయారు చేసి వాట్సాప్‌లో అందుబాటులో ఉంచడంతో విద్యార్థులు వాటికి జవాబులు రాస్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఏ సమయంలో పరీక్షలు పెట్టినా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది. 

-సరోజినీదేవి, భద్రాద్రి కొత్తగూడెం డీఈవో


logo