మంగళవారం 26 మే 2020
Khammam - May 23, 2020 , 03:46:51

రైతు నివేదిక శాగు నివేదిక

రైతు నివేదిక శాగు నివేదిక

  • ఉమ్మడి జిల్లాలో మారనున్నవ్యవసాయ విధానం
  • ఎవుసం లాభసాటి చేసే దిశగా అడుగులు
  • 196 సమావేశ మందిరాల నిర్మాణానికి శ్రీకారం
  •  స్థల సేకరణ పనిలో వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు
  •  నిర్మాణాలు పూర్తయితే రైతు సమస్యలకు పరిష్కారం

ఇకపై సాగులో రైతుబంధు సమితులు ముఖ్యభూమిక పోషించనున్నాయి.. రైతుల ప్రతి కష్టాన్ని ‘రైతు వేదికల’ ద్వారా పరిష్కరించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో వేదికల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.. ప్రతి 5 వేల హెక్టార్లకు ఒక నిర్మాణం చేపట్టేలా అధికారులు స్థలసేకరణ చేపడుతున్నారు.. ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు 60 శాతానికి పైగా నిర్మాణాలకు స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో మిగతా వాటికీ స్థల సేకరణ పూర్తి కానుంది.. అనంతరం యుద్ధప్రాతిపదికన భవన నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి.             

 -కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం

ఖమ్మం వ్యవసాయం/కొత్తగూడెం: తెలంగాణ వ్యవసాయ రంగంలో త్వరలోనే మరో నూతన ఘట్టం ఆవి ష్కరించనుంది. ఇందులో అత్యంత కీలకమైన ‘రైతు వేదిక’ల కార్యాలయాలు మరి కొద్ది రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా సిద్ధం కానున్నా యి. వీటి నిర్మాణానికి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 83చోట్ల స్థల సేకరణ కసరత్తు పూర్తయింది. సాగును దండుగగా కాకుండా, పండుగగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సాగును రైతులకు భారంగా కాకుండా సంబురంగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ దిశగానే ‘రైతు వేదిక’లకు రూపకల్పన చేసింది.

ఇదీ స్వరూపం..

ప్రతి ఐదువేల హెక్టార్ల(క్లస్టర్‌)కు ఒకటి చొప్పు న ఖమ్మం జిల్లావ్యాప్తంగా 129 క్లస్టర్లను ప్రభు త్వం ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కో రైతు వేదిక(భవనం)ను అరెకరం విస్తీర్ణం లో సుమారు రూ.12లక్షల వ్యయం తో నిర్మించాలని నిర్ణయించింది. ఈ వేదిక భవనంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) కార్యాల యం, సమావేశ మందిరం, గోడౌన్‌ ఉంటాయి. ఈ వేదిక నిర్వహణలో రైతు బం ధు సమితులు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. వీటి సభ్యు లకు, కోఆర్డినేటర్లకు ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా అవగాహన సదస్సులు నిర్వ హించింది. పంటల సాగు, మా ర్కెటింగ్‌ తదితర అంశాలపై రానున్న రోజుల్లో అవగాహన సదస్సు లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

సదస్సులు, సమావేశాలు, శిక్షణ తరగతులు, ఏఈవో కార్యాలయం, గోడౌన్‌, క్లస్టర్‌ కార్యకలా పాలు& వీటన్నింటికీ రైతు వేదిక భవనం కేం ద్రంగా ఉంటుంది. ఇప్పటివరకూ 83 వేదికల నిర్మాణానికి జిల్లా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించాయి. మిగిలిన వేదికలకు కూడా స్థలాలను త్వరలోనే సేకరించేందుకు ప్రయత్నాలు సా గుతున్నాయి. జిల్లా వ్యవసా య శాఖ పరిధిలో మొత్తం ఐదు వ్యవసాయ సహాయ సంచాలకుల కా ర్యాలయా లు (ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున), మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలు 21 ఉన్నాయి. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు మండల కా ర్యాలయాల్లోనే విధు లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికల ని ర్మాణం పూర్తయితే.. ఈ విస్తరణాధికారులు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తారు.

గ్రామాల్లోనే మార్కెటింగ్‌..

వ్యవసాయ రంగంలో నూతన ఘట్టం ఆవి ష్కరణకు ఇవి ‘వేదిక’గా మారనున్నాయి. ఏ గ్రామంలో ఏయే రైతులు ఎంతెం త పంటను ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ఈ ‘వేదిక’లు నిర్ణయిస్తాయి. ఏ పంటకు ఏయే మందులను ఎం తెంత మోతాదాతులో పిచికారీ చేయాలన్నది కూడా ‘వేదిక’లే చెబుతాయి. పండించిన పంటకు మా ర్కెటింగ్‌ ఏర్పాట్లను కూడా చూస్తాయి. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే రైతు బంధు సమావేశాలు కూడా ప్రతి నెలా జరు గుతాయి. ఈ నిర్ణయాలకు అనుగుణంగానే సాగు నిర్వహణ ఉంటుంది. పంటలకు ఎంత మోతా దులో ఏర కం మందులను పిచికారీ చేయాలి. ఏ భూమిలో ఏ పంటను వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. పంటకు మార్కెట్లో సరైన ధర రానట్టయితే స్థానిక కమిటీలే కొనుగోలు చేస్తాయి. రైతులకు ఏఈవోలు నిత్యం అందుబాటులో ఉం టారు. రైతులు తమ పంటను ఇక్కడి గోడౌన్‌లో నిల్వ చేసుకోవచ్చు.

కొత్తగూడెం జిల్లాల్లో 67 ‘వేదిక’లు..

కొత్తగూడెం జిల్లాలో 67 క్లస్టర్లలో ‘రైతు వేదిక’లను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధ మైంది. ఇప్పటికే 32 ‘వేదిక’లకు స్థలాల సేకరణ పూర్తయింది. మిగిలిన 35 ‘వేదిక’లకు  అతి త్వర లో స్థలాలను సేకరించేందుకు అధి కారులు కసర త్తు చేస్తున్నారు. పంటల సాగు విధానంపై ప్రభు త్వం స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించ ను న్నాయి. జిల్లా స్థాయిలో రైతుబంధు కోఆర్డి నేటర్‌గా అంకిరెడ్డి కృష్ణారెడ్డి నియమితు లయ్యారు. రైతులు ఎలాంటి పంటలను ఎంత మొత్తంలో సాగు చేయాలన్న విషయమై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. దీనికి అనుగుణంగా జి ల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది.

రైతులకు అండగా ‘వేదిక’లు


  ప్రస్తుతం సమాజానికి రైతు కీలకం కానున్నాడు. రైతు పంట పండిస్తేనే అందరికీ అవసరాలు తీరుతాయి. అవసరం లేని పంటలు వేసి శ్రమను వృథా చేసుకోకుండా మార్కెట్‌కు అనుగుణంగా పంట లు వేయాలి. అప్పుడే మంచి ధర లభిస్తుంది. జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఎలాంటి పంటలు వేయాలనేది ‘వేదిక’ కేంద్రంగా రైతుబంధు సమితులు నిర్ణయిస్తాయి.

-అంకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్‌

‘రైతు వేదిక’లతో అనేక ప్రయోజనాలు 

‘రైతు వేదిక’ భవనాలతో అన్నదాతలకు అనేక ప్రయోజనాలు ఉం టాయి. ఎరువులు, మందులు, విత్తనాల ఎంపిక, మార్కెటింగ్‌.. ఇలా సమస్త అంశాల్లో రైతులకు ఈ వేదికలు మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. ఇక్కడ వ్యవసాయ విస్తరణ అధికారి నిరంతరం అందుబాటులో ఉంటారు. రైతు వేదికల భవనాల కోసం ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 83 గ్రామాల్లో స్థలాలను గుర్తించాం. మరో 46 భవనాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది.

- అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి, 

ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి.

రైతుబంధు సమితి సూచనల ప్రకారంగానే సాగు రైతుబంధు సమితులు ఇప్పుడు ప్రధాన భూమిక పోషించాలి. పంటల సాగుపై ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాని అమలులో రైతుబంధు సమితులదే ప్రధాన బాధ్యత. స్థానిక పరిస్థితులనుబట్టి రైతులు లాభసాటిగా ఉండే పంటలు వేయాల్సి ఉంటుంది. దాని ప్రకారమే విత్తనాల సరఫరా ఉంటుంది.

-కొర్సా అభిమన్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి.


logo