మంగళవారం 26 మే 2020
Khammam - May 23, 2020 , 03:34:59

పకడ్బందీగా ఎల్‌ఆర్‌ఎస్‌

పకడ్బందీగా ఎల్‌ఆర్‌ఎస్‌

  • ఖమ్మం నగరపాలక సంస్థకు  రూ.85 కోట్ల ఆదాయం
  • ప్రతి పత్రం క్లియరెన్స్‌కు పటిష్ట చర్యలు
  • దరఖాస్తుల స్వీకరణలో ఖమ్మానికి రాష్ట్రంలో మూడో స్థానం 
  • నగరవాసుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం..

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌,బీఆర్‌ఎస్‌  పథకాలు పట్టణ,నగరవాసులకు వరంలా మారాయి. దరఖా స్తు చేసుకున్న వెంటనే అధికారులు ఇంటికే వచ్చి సమస్య పరిష్కరిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థలాన్ని కొనుగోలు చేసి అనుభవిస్తున్నప్పటికీ దానిపై పూర్తిస్థాయిలో పత్రాలలేమి కారణంగా తనఖాకుగానీ, రుణాలు పొందేందుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బంది పడేవా రు. తెలంగాణ ప్రభుత్వం భూక్రమబద్ధీకరణ పథ కం (ఎల్‌ఆర్‌ఎస్‌), భవన క్రమబద్ధీకరణ (బీఆర్‌ఎస్‌)కు అవకాశం ఇవ్వడంతో స్థలాలను రెగ్యులరైజ్‌ చేయించుకునేందుకు ఉత్సాహం చూ పారు. 2015 అక్టోబర్‌ వర కు రిజిస్ట్రేషన్‌  అయిన స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించడంతో ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోని ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఖమ్మం నగరంలో స్థలా ల క్రమబద్ధీకరణ కోసం 18,048 దరఖాస్తులు అందాయి. వీటిలో అధికార యంత్రాంగం 10,054 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించింది. వివి ధ కారణాల రీత్యా 497 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరికొన్ని  దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.84.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరో రూ. 2.95 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.  వసతుల కల్పన కోసం వనరులను సమకూర్చుకునే క్రమంలో పట్టణాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఒక ప్రధాన వనరుగా నిలిచింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాం గం కార్యాచరణ రూపొందించుకుని అమలు చేస్తున్నది. స్థలాల విలువ నానాటికీ పెరుగుతుండడంతో వాటికి సంబంధించిన వివాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌తో స్థల వివాదాలకు  బ్రేక్‌ పడనుంది. 

 సొంతింటి కల సాకారం...

 భూమి ధరలు పెరిగిపోవడంతో వంద గజాల స్థలం కొనుగోలు చేయడం గగనంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోవడంతో ప్రజల్లో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే తపన పెరిగింది. పట్టణాల్లో అద్దెలు కూడా భారీగా పెరగడం తో కిరాయిదారులు వ్యయప్రయాసల కోర్చి సొంత స్థలాన్ని సమకూర్చుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వివాదరహితమైన, ప్రభు త్వ అనుమతి ఉన్న స్థలాలను కొనుగోలు చేయాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ క్రమం లో ఎల్‌ఆర్‌ఎస్‌ నగర వాసులకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నది. 

రాష్ట్రంలోనే ఖమ్మం నగరానికి మూడో స్థానం

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్వీకరణలో ఖమ్మం నగ రం రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల అనంతరం ఖమ్మం నగరంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 18,048 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 10 వేల 54 దరఖాస్తులను పరిష్కరించారు. 497 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. నిబంధనలకు అనుగుణంగా సరైన పత్రాలను సమర్పించకపో వడంతో తిరస్కరణకు గురైనట్లు తెలుస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభు త్వం ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పలువురు తమ దరఖాస్తులకు 10 వేల రూపాయల డీడీలను జత చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అందజేశారు. నిర్ణీత గడువులోపు వ చ్చిన దరఖాస్తులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిం చే అవకాశం లేకపోవడంతో తొలుత వాటిని స్వీకరించారు. పరిశీలన సమయంలో దరఖాస్తుదారులు సరైన పత్రాలు జత చేయలేదని వారికి తెలిపారు. దీంతో కొన్ని దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు చెరువులు, మున్నేరు పరిసర ప్రాంతా ల్లో  నివాసముంటున్న స్థలాలకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో అధికారులు పరిశీలించి తిరస్కరించినట్లు తెలుస్తున్నది. నిబంధనలకు ఏ మాత్రం ఇబ్బందికరంగా ఉన్నా సరైన పత్రాలను తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. అలాగే వారసత్వ భూము లకు సంబంధించి కూడా సమస్యలు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తులు పంపకాల అనంతరం ఏర్పడిన విభేదాలను ఆసరాగా చేసుకుని ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా ఒక అవగాహనకు వచ్చిన అనంతరం వాటిని పరిష్కరించాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తున్నది. 

పారదర్శకంగా ..

భూ క్రమబద్ధీకరణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 75 గజాల స్థలం ఉన్న వారికి తక్షణమే భూ కమబద్ధీకరణ చేస్తున్నారు.  నిరుపేదలు నగరంలోని పలు ప్రాం తాల్లో  ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్న సందర్భాలు అ నేకం ఉన్నాయి. అలాంటి వారికి 75 గజాలలోపు స్థలం క్రమబద్ధీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో వారు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం ద్వారా క్రమబద్ధీకరించబడిన భూమిలో  భవన నిర్మాణానికి అవసరమైన రుణాలను బ్యాంక్‌ మంజూరు చేయనున్నాయి. ఖమ్మం నగరంలోని ఆయా డివిజన్లలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దగ్గరికి అధికార యంత్రాంగం వెళ్లి పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇంటి దగ్గరికే వచ్చి సమస్య పరిష్కరిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. logo